భైంసా ఘటనపై ఆరా తీసిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ ‌షా

amit shah, Amit Shah Spoke to Kishan Reddy and Enquired about Bhainsa Incident, Bhainsa, Bhainsa witnesses communal clash, Code of Criminal Procedure, Communal clash in Bhainsa town, Communal Clash In Telangana Bhainsa, Communal Clash In Telangana’s Bhainsa Town, Communal Clash In Telangana’s Bhainsa Town Leads To Tension, Mango News, Section 144 Imposed In Bhainsa, telangana, Tension in Bhainsa following clashes, Union Home Minister, Union Home Minister Amit Shah, Zulfiqar Mosque

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆరా తీశారు. తనకు ఫోన్ చేసి ఆ ఘటన, అక్కడి ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరా తీసినట్టు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు. అలాగే తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డితో ఈ ఘటనపై మరోసారి మాట్లాడానని, పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉందని మరియు నేరస్థులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చినట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

మరోవైపు భైంసా ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. నాగరిక సమాజ పురోగతికి శాంతి మరియు సామరస్యం ప్రాథమికమైనవని పేర్కొన్నారు. భైంసాలో హింసకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏ రూపంలోనైనా చట్టవ్యతిరేక చర్యలను సహించదని చెప్పారు. పుకార్లు, విభజన శక్తుల నాయకత్వంలోని విద్వేషపూరిత ద్వేషం ఉచ్చులో పడొద్దని భైంసా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహించి, ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ముందుగా భైంసా పట్టణంలో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య గొడవ చోటుచేసుకొని, పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య చెల‌రేగిన ఈ ఘ‌ర్ష‌ణ‌లో పోలీసు సిబ్బంది సహా ప‌లువురు గాయపడ్డారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =