భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భేటీ

Australia Prime Minister Anthony Albanese Called on President Droupadi Murmu at Rashtrapati Bhavan Today,Australia Prime Minister Anthony Albanese,President Droupadi Murmu,Rashtrapati Bhavan Today,Anthony Albanese Called on Droupadi Murmu,Mango News,Mango News Telugu,Australia PM Albanese calls on President Murmu,Australian PM calls on Prez Droupadi Murmu,Prime Minister of Australia,Australian PM India Visit Live,Droupadi Murmu at RashtrAPati Bhavan,India President Droupadi Murmu,President Of India Droupadi Murmu,President Draupadi Murmu Speech,Latest Indian Political News,National Political News

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భేటీ అయ్యారు. ప్రధాని అల్బనీస్ మరియు ఆస్ట్రేలియా ప్రతినిధి బృందానికి స్వాగతం పలికిన రాష్ట్రపతి, భారతదేశం మరియు ఆస్ట్రేలియా చాలా స్నేహపూర్వక సంబంధాన్ని కలిగి ఉన్నాయని అన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వైపాక్షిక చర్చలకు ఊతం ఇచ్చిందన్నారు. ఈ పర్యటన భారత్‌-ఆస్ట్రేలియా సంబంధాల్లో మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

భారతదేశం మరియు ఆస్ట్రేలియాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని మరియు సంస్థాగత చర్చలు విస్తృతంగా జరగడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. క్రిటికల్ మినరల్స్, న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ, సైబర్ డిప్లొమసి మరియు ఇన్నోవేషన్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో రెండు దేశాలు తమ ఆచరణాత్మక సహకారాన్ని కొనసాగించాలని ఆమె అన్నారు. ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజం కష్టపడి పని చేసేవారిగా, శాంతిని ప్రేమించేవారిగా, వ్యవస్థాపక నైపుణ్యాలతో ప్రసిద్ది చెందిందని రాష్ట్రపతి అన్నారు. ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజానికి సేఫ్, సురక్షితమైన మరియు సానుకూల వాతావరణాన్ని అందించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశ్వాసం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + nine =