సీఎం కేసీఆర్ వ‌న‌ప‌ర్తి పర్యటన.. జిల్లా అభివృద్ధికి భారీగా నిధులు కేటాయింపు

CM KCR Participates in Public Meeting at Wanaparthi District Today, CM KCR Participates in Public Meeting at Wanaparthi, Public Meeting at Wanaparthi, CM KCR Participates in Public Meeting, Wanaparthi District, Wanaparthi, CM KCR Participating in Public Meeting at Wanaparthi District, Public Meeting at Wanaparthi District, CM KCR Public Meeting, Public Meeting, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Manog News, Manog News Telugu,

సీఎం కేసీఆర్ ఈరోజు (మంగళవారం) వనపర్తి జిల్లా పర్యటనలో పాల్గొన్నారు. వనపర్తి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వ‌న‌ప‌ర్తి జిల్లా వేదిక‌గా మ‌న ఊరు-మ‌న బ‌డి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. త‌ర్వాత వనపర్తి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా.. అనంత‌రం నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌న రాష్ట్ర‌, దేశ‌, ప్ర‌పంచ మ‌హిళ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

వనపర్తి పట్టణానికి రూ.కోటీ, మున్సిపాలిటీలకు రూ.50 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు సీఎం సహాయనిధి నుంచి మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోని తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రధాన సమస్యలైన కరెంట్‌, తాగు-సాగు నీరు వంటి కష్టాలను దాటామని చెప్పారు. క‌ల్వ‌కుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నామని అన్నారు. వనపర్తి జిల్లాలో మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైద‌రాబాద్ నుంచి గ‌ద్వాల్ దాకా పొలాల్లో ధాన్య‌పు రాశులను చూశానని.. ఇంకా పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం కూడా త్వ‌ర‌లో పూర్తి చేస్తే.. అద్భుత‌మైన పంట‌ల‌తో పచ్చగా కళకళలాడుతుందని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =