విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి ఉన్న, సమర్థులైన అభ్యర్థులందరినీ గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఎస్

CS Somesh Kumar held Meeting on Overseas Jobs and Providing Employment in Abroad for State Youth, CS Somesh Kumar Meeting on Overseas Jobs,Employment Abroad for State Youth,Telangana CS Somesh Kumar,Mango News,Mango News,Telangana CM KCR, KTR, Kalavakuntla Kavitha, Telanagana TRS,K Chandra Shekar Rao,Kalavakuntla Taraka Rama Rao,TRS Latest News And Updates, Bharat Rashtra Samithi,TRS Party

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు విదేశాలలో ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి ప్రత్యేకంగా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ తెలిపారు. విదేశీ ఉద్యోగాల కల్పనపై వివిధ శాఖలు చేపట్టిన చర్యలపై సీఎస్ సోమేశ్ కుమార్ బీఆర్కేఆర్ భవన్‌లో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి ఉన్న, సమర్థులైన అభ్యర్థులందరినీ గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సీఎస్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఓవర్ సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టామ్‌కామ్) అభివృద్ధి చేసిన యాప్‌లో నర్సింగ్ అభ్యర్థులను గుర్తించి, నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులను సీఎస్ కోరారు. విదేశాలకు వెళ్లడానికి ఇష్టపడే నమోదిత నర్సింగ్ ప్రాక్టీషనర్లు మరియు అభ్యర్థులందరికీ ఎస్ఎంఎస్ ద్వారా సందేశంతో పాటు, కాల్ సెంటర్ ద్వారా కూడా తెలియచెప్పాలని అన్నారు.

నమోదిత అభ్యర్థులందరికి ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని మరియు విదేశాలలో ఉద్యోగం చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆటో మెకానిక్‌లు, నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు మరియు ఇతర సారూప్య నిపుణుల కోసం ఇలాంటి ప్రక్రియను చేపట్టాలని సీఎస్ అన్నారు. టామ్‌కామ్‌లో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎస్ కు తెలియజేశారు. ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించేందుకు 20 దేశాలు ప్రాధాన్య దేశాలుగా గుర్తించామని, ఆసక్తిగల అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి మొబైల్ యాప్‌ను రూపొందించినట్లు వారు వివరించారు. ఈ సమావేశంలో కార్మిక, ఉపాది శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్‌ నవీన్‌ మిట్టల్‌, కార్మిక శాఖ కమీషనర్ అహ్మద్ నదీమ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, సీఎం ఓఎస్‌డీ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − ten =