జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ఇదే: డిసెంబర్ 1 పోలింగ్, 4 న ఫలితాలు

GHMC Elections Schedule Released, Polling on December 1st

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి మొదలైంది. ఈ రోజు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ‌(ఎస్‌ఈసీ) పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. డిసెంబర్‌ 1 న పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అలాగే ఓట్ల లెక్కింపు పక్రియ డిసెంబర్ 4 న చేపట్టనున్నారు. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించి, ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇక షెడ్యూల్ విడుదల అవ్వడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌:

  • నోటిఫికేషన్‌ జారీ తేదీ: నవంబర్ 17
  • నామినేషన్లు ప్రారంభం: నవంబర్ 18
  • నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ: నవంబర్ 20
  • నామినేషన్ల పరిశీలన: నవంబర్ 21
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 22
  • పోలింగ్ తేదీ: డిసెంబర్ 1 (ఉదయం 7 గంటలు నుంచి సాయంత్రం 6 గంటల వరకు)
  • రీ-పోలింగ్ (అవసరమైతే): డిసెంబర్ 3
  • ఓట్ల లెక్కింపు పక్రియ: డిసెంబర్ 4

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =