కొత్తగా 7 పోలీస్ కమీషనరేట్లు, ప్రత్యేక మహిళా భద్రత విభాగం ఏర్పాటు చేశాం: హోమ్ మంత్రి

Home Minister, Home Minister Mahmood Ali, Hyderabad, Mahmood Ali, Mahmood Ali Participated in Stipendiary Constables Passing out Parade, Stipendiary Cadet Trainee Police Constables, Stipendiary Cadet Trainee Police Constables passing-out parade, Stipendiary Constables Passing out Parade, Telangana Home Minister Mahmood Ali

శాంతి, భద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని దీనిలో భాగంగా తెలంగాణా పోలీస్ శాఖ ఆధునీకరణ, నూతన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడంతో పాటు కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, నూతన వాహనాల ఏర్పాటు తదితర చర్యలకు అధిక మొత్తంలో నిధులను మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహ్మాద్ మహమూద్ అలీ అన్నారు. అక్టోబర్ 8, గురువారంనాడు యూసుఫ్ గూడా మొదటి బెటాలియన్ లో జరిగిన 499 స్టైఫండరీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్య అతిధులుగా రాష్ట్ర హోమ్ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, బెటాలియన్స్ ఏ.డి.జీ అభిలాష బిస్ట్ లు హాజరయ్యారు.

ఈ సందర్బంగా హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, దేశంలోనే తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ఆదర్శనీయంగా ఉందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాంతి, భద్రతలో పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత నిచ్చిందని, ఇందుకు గాను పోలీస్ శాఖకు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక నిధులను కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. కొత్తగా 7 పోలీస్ కమీషనరేట్లు ఏర్పాటు చేయడంతోపాటు మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేక మహిళా భద్రత విభాగాన్ని ఏర్పాటు చేసామని వివరించారు.

ఈ సందర్బంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ పోలీస్ శాఖ ఆధునీకరణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. పోలీస్ అంటే ఇతర శాఖల మాదిరిగా కేవలం ఒక ఉద్యోగి కాదని, సమాజ సేవకుడిగా పోలీస్ రోజూ 24 గంటలు విధుల్లో ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమాజంలో ప్రజల భద్రత, సంక్షేమం ధ్యేయంగా ప్రతి క్షణం పని చేయాలని ఉద్బోధించారు. శాంతి, భద్రతలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి సాథ్యం. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి పోలీస్ శాఖ పనితనానికి నిదర్శనమని, దేశంలోనే తెలంగాణ పోలీస్ పనితీరు అద్భుతంగా ఉందని అన్నారు. దీనికి నిదర్శనమే రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తున్నపెట్టుబడులు, పారిశ్రామీకరణ అని వివరించారు. సీఎం కేసీఆర్ పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానాన్ని వినియోగించడం, సి.సి కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో నేరాలు జరిగిన అతి కొద్ది సమయంలోనే నేరస్తులను పట్టు కోవడం జరుగుతోందని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు తమ అవసరాల నిమిత్తం వచ్చే ప్రజలకు సముచిత గౌరవం, మర్యాద ఇచ్చి సరైన రీతిలో స్పందించి పోలీస్ శాఖ గౌరవం ఇనుమడింప చేయాలని తెలియచేసారు. ఈ సందర్బంగా స్టైఫండరీ పోలీసులు నిర్వహించిన కవాతు, డ్రిల్, స్లో మార్చ్ పీల్స్ ఆఫ్ పరేడ్, కరాటే డెమో, ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ ఏకె మిశ్రా స్వాగతం పలకగా, అడిషనల్ కమాండెంట్ కె.వీరయ్య వందన సమర్పణ చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =