నగరంలో అల్లర్లుకు కొందరు కుట్ర, పాల్పడే వ్యక్తులకు జైలు శిక్ష తప్పదు: సీపీ అంజనీ కుమార్‌

Anjani Kumar, Communal Issues in the City, GHMC, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, Hyderabad CP, Hyderabad CP Anjani Kumar, Hyderabad CP Anjani Kumar Warns, Hyderabad CP Anjani Kumar Warns Evil Minds, Mango News

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగరంలో కొందరు అల్లర్లు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ అన్నారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, జైలు శిక్ష తప్పదని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. “ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల వాతావరణం ఉంది. ఈ ఎలక్షన్ సమయంలో ప్రతి రాజకీయపార్టీకి చెందిన నాయకులు ప్రజల వద్దకు వస్తున్నారు. ప్రతి రోజు కూడా రాత్రివరకు పార్టీ విధానాలు, హామీలు ప్రజలకు వివరిస్తున్నారు. ఈ పక్రియ ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటింది. అయితే ఇదే సమయంలో కొంతమందితో కూడిన ఒక చిన్న గ్రూప్ నగరంలో మతపర సామరస్యతను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడం ఇష్టం లేకనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడు సంవత్సరాలుగా కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి ఎంతపేరు వచ్చిందో మనందరికీ తెలుసు. మంచి ఇమేజ్, మంచి శాంతిభద్రతలు, ఎలాంటి మతపరమైన అల్లర్లు లేకపోవడం వలనే హైదరాబాద్ కు పేస్ బుక్, ఆపిల్ వంటి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. కానీ ఎన్నికల పరిస్థితుల్లో నగరంలో అల్లర్లతో చెడ్డపేరు తీసుకొచ్చేందుకు కొందరు పనిచేస్తున్నారు. పేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు, సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. అందరికి ఒకటే అభ్యర్థన చేస్తున్నా. ఇలాంటి వారిని మనమంతా కలిసి బయటపెట్టాలి. హైదరాబాద్ నగరంలో ఇలాంటివారికి చోటు లేదు. నగరాన్ని మరింత గొప్ప ఎత్తుకు మనం తీసుకెళ్లాలి. తప్పుడు ప్రచారాలు, అల్లర్లకు పూనుకునే వ్యక్తులపై సమాచారాన్ని గుర్తిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లకు తెలియజేసి, పోలీసు డిపార్ట్మెంట్ కు ప్రజలు సహకరించాలి. శాంతిభద్రతల్లో భాగంగా అల్లర్లకు పాల్పడే వ్యక్తులకు జైలు శిక్ష తప్పదు” అని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + seventeen =