మెట్రో రైలు ప్రమాద వార్తలన్నీ అవాస్తవం

Hyderabad Metro MD About Metro Rail Accident, Hyderabad Metro MD Condemns The Rumors On Metro Rail, Hyderabad Metro MD speaks on Rumors, Hyderabad Metro officials Speak On Rumors, Hyderabad Metro rail Accident a Rumors Says Metro MD, Mango News

ఈ రోజు హైదరాబాద్ మెట్రో రైలుకు ప్రమాదం అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు ఒక ట్రాక్ బదులు మరో ట్రాక్ లో వెళ్లడం వలన ప్రమాదం జరిగేదంటూ వస్తున్న వార్తలని ఆయన ఖండించారు, పూర్తిగా వివరాలు తెలుసుకోకుండా వదంతులు వ్యాప్తి చేయొద్దని కోరారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వచ్చిన గాలుల వలన ఒక రాడ్ ట్రాక్ పై పడిపోవడంతో ఎల్బీనగర్ నుండి మియాపూర్ వెళ్తున్న రైలు అసెంబ్లీ స్టేషన్ దాటి లక్డికాపూల్ వద్దకు రాగానే ఆగిపోయింది. రైలులో ఒక ఆస్తమా పేషెంట్‌ ఉండడంతో, ముందుగా విద్యుత్ సరఫరా ఆపేసి, బాటరీ పవర్ తో రివర్స్ తీసుకెళ్లి మళ్ళీ అసెంబ్లీ స్టేషన్ వద్ద నిలిపారు. జరిగిన ఈ సంఘటన వలన మెట్రో రైలుకు పెద్ద ముప్పు తప్పిందంటూ ఒక్క సారిగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

వచ్చిన వార్తల పట్ల మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందిస్తూ, లక్డికాపూల్ వద్ద రైలు ఆగినప్పటినుండి సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారని, అదే ట్రాక్ పై వెనుక వచ్చే రైలు తో సమన్వయం చేసుకుని ఆపామని చెప్పారు. ట్రాక్ పై రాడ్ తొలగించిన తర్వాత యధావిధిగా మెట్రో రైలు సేవలు కొనసాగుతున్నట్టు చెప్పారు. సంఘటన జరిగిన సమయంలో రైలు వెనక్కి వెళ్లడంతో ఏమి జరిగిందో తేలియక రైలు లో ఉన్న కొంతమంది భయానికి గురయ్యి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఒక్క సరిగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మియాపూర్- ఎల్బీనగర్ మార్గంలో రైలు సేవలు సాఫీగా సాగుతున్నాయి అని తెలియజేసారు.

 

[subscribe]
[youtube_video videoid=ZnBMFaq_f3U]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 12 =