భాగ్యనగరంలో వరుస వానలతో మునిగిపోతున్న చిరువ్యాపారులు

Hyderabad Street Vendors Faces Problem With No Business Due To Continuous Heavy Rains,Hyderabad Street Vendors Faces Problem,No Business Due To Continuous Heavy Rains,Hyderabad Business Due To Heavy Rains,Mango News,Mango News Telugu,Small traders, drowning, continuous rains, rains, Hyderabad, Hyderbad Vendors, Charminar,Madheena,Hyderabad Street Vendors Latest News,Hyderabad Street Vendors Latest Updates,Hyderabad Street Vendors Live News,Hyderabad Street Vendors Live Updates,Hyderabad News,Telangana News

హైదరాబాద్‌లో వరుసగా కురుస్తున్న‌ వర్షాలతో చిరు వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా వ‌ర్షాల ప్ర‌భావం స్ట్రీట్ మార్కెట్ల‌పై, చిరు వ్యాపారులపై పడుతోంది. దీంతో స్థానికంగా జీవ‌నోపాధి పొందుతున్న వారిపై ఎక్కువగా ప్ర‌భావం ఉంటోంది. వీధుల్లో చిన్న చిన్న వస్తువులను అమ్ముకునేవారితో పాటు.. బజ్జీలు, పునుగులు, వంటి స్ట్రీట్ ఫుడ్ తయారీ చేసి అమ్మేవాళ్లు నష్టపోతున్నారు.

కొద్ది రోజులుగా తెలంగాణలో కురుస్తున్నవరుస వర్షాలతో.. హైద‌రాబాద్‌తో పాటు కొన్ని జిల్లాలలోని చిరు వ్యాపారాలపై నీడలు కమ్ముకున్నాయి. ఇప్పుడు నష్టపోయామని కాదు కానీ.. వ్యాపారం తగ్గిపోవడం వల్ల పరిస్థితి ఇలాగే కొనసాగితే కోలుకోలేని నష్టాల్లోకి చేరుకుంటామని చిరు వ్యాపారులు, స్థానిక వ్యాపారులు వాపోతున్నారు.

తెలంగాణలో జులై, ఆగస్టు నెలల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు , వరదలు వచ్చాయి. దీంతో వర్షాల వల్ల ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. చివరకు వారాంతాల్లో కళకళలాడాల్సిన మార్కెట్లు వర్షాలతో చిన్నబోయాయి. రెండు నెలలుగా దుకాణదారులు దాదాపు మార్కెట్లకు దూరంగా ఉంటున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి.

దీంతో తాము అనుకున్నట్లుగా వ్యాపారం జరగకపోవడంతో..ఇంటి ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లో వ్యాపారులు పడ్డారు. ముఖ్యంగా పతేర్‌గట్టి, మదీనా బిల్డింగ్, గుల్జార్ హౌజ్, చార్మినార్ వద్ద ఉన్న మార్కెట్లు.. ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటాయి. హైదరాబాదీలే కాదు దేశం నలుమూలల నుంచి కూడా ప్రజలు ఇక్కడ దొరికే వస్తువుల కోసం ప్రత్యేకంగా వెళుతుంటారు. అంతెందుకు విదేశీ పర్యాటకులకు అవి షాపింగ్ ప్లేసులుగా ముద్రపడిపోయాయి. కానీ వరుస వర్షాలతో దుకాణాలు ముందే మూసుకోవడం లేదా.. తెరవకపోవడంతో పూట గడవడం కూడా కష్టంగా మారిందంటున్నారు కొంతమంది.

హైదరాబాద్ సిటీలో నయాపూల్ జంక్షన్ నుంచి షహలీబండ వరకు దాదాపు 4,000 దుకాణాలు వరకూ నడుస్తాయి. వీటితో పాటు సుమారు 2,000 మంది చిన్న వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. వీధుల్లో చిన్నచిన్న వస్తువులను అమ్ముకుంటూ జీవనోపాధిని పొందుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో స్థానిక చిరు వ్యాపారులతో పాటు తోపుడు బండ్ల వ్యాపారులపైన ఆ ప్రభావం పడుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =