మనసున్న మారాజు అన్నయ్య చిరంజీవి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Wishes his Brother Megastar Chiranjeevi on his Birthday, Megastar Chiranjeevi Birthday, Janasena Chief Pawan Kalyan Wishes his Brother, Megastar Chiranjeevi, Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan, Chiranjeevi, Mega Carnival event, Mega Carnival 2022, 2022 Mega Carnival, Mega Carnival, Megastar Chiranjeevi News, Megastar Chiranjeevi Latest News And Updates, Megastar Chiranjeevi Live Updates, Mango News, Mango News Telugu,

ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు సందర్భంగా పలు పరిశ్రమల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, తోటి నటీనటులు, మెగాభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన అన్నయ్య చిరంజీవి మనసున్న మారాజు అని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

“అన్నయ్య….తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం. ఎందుకంటే నేను ఆరాధించే చిరంజీవి గారిని పిలవడమే కారణమేమో, ఆయనను అన్నయ్యా అని పిలిచినప్పుడల్లా అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది. అటువంటి అన్నయ్యకు జన్మదిన సందర్భంగా మనసా వాచా కర్మణా అనురాగపూర్వక శుభాకాంకలు. చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి నాలుగు మాటలు ఏం చెప్పాలంటే ఒకింత కష్టమే. ఎందుకంటే-ఆయన జీవితం తెరిచిన పుస్తకం, ఆయన ఇంతవాడు అంతవాడైన విషయం చెప్పాలా, ఆయన సాధించిన విజయాలు గురించి చెప్పాలా, ఆయన సినిమాల్లో సాధించిన రికార్డుల గురించి చెప్పాలా, ఆయన అధిరోహించిన పదవుల గురించి ఉప్పాలా, ఆయన కీర్తి ప్రతిష్ఠుల గురించి చెప్పాలా, ఆయన సేవాతత్పరత గురించి చెప్పాలా, ఇవన్నీ తెలుగు వారందరితోపాటు యావత్ భారతదేశమంతటికి సర్వ విదితమే. అయితే అన్నయ్యలోని గొప్ప మానవతావాది గురించి చెప్పడమే నాకు ఇష్టం, దోసిట సంపాదిస్తే గుప్పెడు దానం చేయాలనే ఆయన జీవన విధానాన్ని ఎంత పొగిడినా తక్కువే. చమటను దారగా పోసి సంపాదించిన సొమ్ము నుంచి ఎందరికో సహాయం చేశారు” అని అన్నారు.

అటువంటి సుగుణాలున్న అన్నయ్యకు తమ్ముణ్ణి కావడం నా పూర్వ జన్మ సుకృతం:

“పేదరికంలో బాధపడుతున్నా, అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనా లేదా చదువులకు దూరమైన వారి గురించి ఎవరి ద్వారా తెలిసినా తక్షణం స్పందించి సాయం చేసే సహృదయుడు అన్నయ్య. కోవిడ్ సమయంలో పనులు లేక సినీ కార్మికులు ఆకలితో ఆలమటించకుండా ఆయన చూపిన దాతృత్వం… బ్లడ్ బ్యాంక్ స్థాపించి లక్షలాది మందితో ఏర్పరచుకున్న రక్త సంబంధం.. వేలాది గుప్త దానాలు…ఇలా ఒకటి రెండు కాదు. ఇటీవల ప్రకటించిన ఉచిత ఆసుపత్రి స్థాపన వరకూ చేస్తున్న కార్యక్రమాలు ఆయనలోని మానవతా మూర్తిని తెలియచేస్తాయి. అన్నిటికన్నా మిన్న ఆయనలోని ఒదిగి ఉండి లక్షణం. తాను కలవబోయే వ్యక్తి ప్రతి నమస్కారం కూడా చేయలేని కుసంస్కారి అయినప్పటికి తను చేతులెత్తి నమస్కరించే సంస్కారం చిరంజీవి గారి సొంతం. వయసు తారతమ్యాలు, వర్గ వైరుధ్యాలు, కులమతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకొనే విశాల హృదయుడు అన్నయ్య చిరంజీవి. అటువంటి సుగుణాలున్న అన్నయ్యకు నేను తమ్ముణ్ణి కావడం నా పూర్వ జన్మ సుకృతం. ఈ శుభదినం సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నాకు తల్లిలాంటి మా వదినమ్మ సహచర్యంలో ఆయన నిండు నూరేళ్ళు చిరాయువుగా వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్న రూపంలో ఉన్న నాన్నకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 10 =