నవంబర్ 26న కూకట్‌పల్లికి పవన్‌కళ్యాణ్‌

Janasena Enters For Election Campaign,Janasena Election Campaign,Janasena Party Election Campaign,Janasena Party Telangana Campaign,Janasena Telangana Campaign,Mango News,Mango News Telugu,Pawan Kalyan,Janasena Chief Pawan Kalyan,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Genaral Assembly Elections

కొద్ది రోజులుగా వినిపిస్తున్న మాటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే చెక్ పెట్టబోతోన్న వార్త  పొలిటికల్ సర్కిల్‌లో తిరుగుతోంది. తెలంగాణలో ముందుగా 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన  జనసేన పార్టీ .. బీజేపీతో పొత్తుతో  కేవలం 8 స్థానాల్లోనే పోటీ చేస్తోంది .  జనసేన పోటీ చేయని మిగతా నియోజకవర్గాల్లో బీజేపీకి మద్దతు ప్రకటించింది.

అయితే ఇక్కడే జనసేనానికి కొద్ది రోజులుగా కొన్ని ప్రశ్నలు వెంటాడుతున్నాయి.  తెలంగాణలో జనసేన బలమెంత?  బీజేపీ బలం ఎంత అనేది తర్వాత తేలాల్సిన విషయమే అయినా.. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తోంది కాబట్టి.. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో  బిజీ అవ్వాలి. కానీ ఎక్కడా కూడా పవన్ జాడ కనిపించలేదంటూ మీడియా వర్గాలలోనూ పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

తెలంగాణలో తిరిగేందుకు  పవన్ ఎందుకు మొహమాటపడుతున్నారు? ఇప్పుడు ఏపీలో ఎన్నికలు లేకపోయినా అక్కడ టీడీపీ , జనసేన మధ్య సమన్వయ కమిటీల సమావేశాలు జరుగుతున్నాయి. మరి తెలంగాణ సభలకు ఎందుకు హాజరవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి తెలంగాణ, ఆంధ్ర అన్న సంగతి పక్కన పెడితే ప్రాంతాల కతీతంగా పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెలిసిందే. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకోకుండా పవన్ తెలంగాణలో ప్రచారాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారన్నచర్చే పెద్ద ఎత్తున జరుగుతుంది.

బీజేపీ ప్రచార కార్యక్రమాల్లో జనసైనికులు బాగానే పాల్గొంటున్నా..జనసేనాని రాని కొరత కనిపిస్తూనే ఉంది.చివరకు  బీజేపీ నేత ధర్మపురి అరవింద్ తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ అని ఓపెన్‌గానే చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయన్ని ప్రచారానికి రమ్మని కోరుతున్నామని.. మీరూ జనసేనానిని రమ్మని ఒత్తిడి పెంచండి అని  జనసైనికుల్ని ఉద్దేశించి ఎన్నికల ప్రచార కార్యక్రమంలోనే చెప్పడం హాట్ టాపిక్ అయింది. దీంతో పవన్‌కు తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టం లేదని ఏదో తప్పని సరి పరిస్తితుల్లో పొత్తు పెట్టుకోవాల్సివచ్చిందని అందుకే  ఏ ప్రచార సభకు  కూడా పవన్ రావడానికి ఇష్టపడ లేదన్న వార్తలు వినిపించాయి.

అయితే ఇలాంటి వార్తలకు చెక్  పెట్టినట్లుగా వినిపిస్తున్నవార్త జనసైనికుల్లో జోష్‌ను నింపింది. పవన్‌ కళ్యాణ్‌ఈ నెల 26న కూకట్‌పల్లికి రానున్నారని.. కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన సభలో  పాల్గొంటారని.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ నిన్నప్రకటించారు.

జనసేన పార్టీ అభ్యర్థి అయిన  ప్రేమ్‌కుమార్‌కి మద్ధతుగా.. ఐటీ ఉద్యోగులు కేపీహెచ్‌బీలో ఆదివారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడిన నాదెండ్ల మనోహర్‌.. త్వరలోనే బీజేపీ ముఖ్యనేతలతో కలిసి  మరొక సభలో కూడా పవన్‌కళ్యాణ్‌ పాల్గొంటారని అన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి వైసీపీ, టీడీపీ విరమించుకోవడంతో.. జనసేన పార్టీ పోటీ చేయాల్సి వచ్చిందని నాదెండ్ల మనోహర్  అన్నారు. తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజల హక్కులను కాపాడాలి అంటే.. కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌ను గెలిపించాలని ఆయన కోరారు. కూకట్‌పల్లిలో త్వరలోనే జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా  ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 6 =