వైద్య శాఖ నుంచి తొలగింపుపై ఈటల రాజేందర్ స్పందన ఇదే …

Etela Rajender Responds over Stripped Stripped Of His Portfolio,Mango News,Mango News Telugu,Eatala Rajender,Minister Eatala Rajender,Eatala Rajender Latest News,Eatala Rajender News,Eatala Rajender Live,Eatala Rajender PressMeet,Eatala Rajender Live News,Eatala Rajender Live New Latest,Eatala Rajender News Latest,Eatala Rajender Removed From Health Minister's Post,Eatala Rajender Stripped Off Health Portfolio,Eatala Rajender Removed From Ministry,Health Minister Eatala Stripped Off His Portfolio,Etela Responds over Stripped of his Portfolio,Etela Rajender Reacts Over Stripped Of His Portfolio,Etela Rajender Responds Over His Portfolio,Eatala Rajender Live Updates

వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తనను బాధ్యతల నుంచి తొలగించడంపై ఈటల రాజేందర్ స్పందించారు. “ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో వైద్యశాఖలో ప్రతి క్షణం రివ్యూ చేసుకుని, నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంటుంది. నా శాఖను ముఖ్యమంత్రికి బదిలీ చేశారని తెలిసింది. ప్రజలకు మంచి మెరుగైన వైద్యం, మంచి సౌకర్యాలు కలగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితిల్లో ప్రజలకు సేవ అందించడంలో వ్యక్తిగతంగా తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను” అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సీఎంకు ఏ శాఖనైనా తీసుకునే అధికారం ఉంటుందని, మంత్రులను మార్చడం సహా సర్వాధికారం ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అన్నారు.

అలాగే తనపై ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతోందని ఈటల ఆరోపించారు. ఏం జరుగుతుందో పూర్తి సమాచారం తెలుసుకుని మళ్ళీ స్పందిస్తానని చెప్పారు. తనపై జరుగుతున్న విచారణపై పూర్తి నివేదిక వచ్చాక మాట్లాడతానని అన్నారు. తదుపరి పరిణామాలపై నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానన్నారు. 20 సంవత్సరాలు నుంచి కష్టపడుతున్న తనకు, ఇలా జరగడంపై ప్రజలు బాధపడుతున్నారని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలపై రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ను సంప్రదించలేదని, ఇక చేయనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + thirteen =