స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల నేతలపై కేసీఆర్ చూపు

KCRs focus on Independent candidates and leaders of small parties,KCRs focus on independent candidates,leaders of Small Parties,Independent candidates of small parties,Mango News,Mango News Telugu,Telangana Assembly Elections 2023,BRS Party,Telangana Chief Minister Kcr,Telangana Cm Kcr, KCRs focus, Independent candidates, leaders of small parties, TRS, Congress, Bjp, Assemblly Elections, Cm KCR,Independent candidates Latest News,Independent candidates Latest Updates,KCRs focus Latest News,KCRs focus Latest Updates
Telangana Assembly Elections 2023,BRS Party, KCR's focus, independent candidates, leaders of small parties, TRS, Congress, Bjp, Assemblly Elections, Cm KCR

తెలంగాణలో స్క్రూటినీ ముగియడంతో నియోజకవర్గాల వారీగా.. ఎంత మంది పోటీ చేస్తున్నారు? ఏ  ఏ పార్టీల తరపున నిలబడ్డారు అనే అంశాలపై గులాబీ బాస్ ఆరాలు తీస్తున్నారు.  వారిలో చిన్న పార్టీల నుంచి నిలబడ్డవారు ఎంత మంది? స్వతంత్ర అభ్యర్థులు ఎవరు అని ఎంక్వైరీలు ప్రారంభించారు.  పార్టీ నేతలలో రెబల్స్‌గా మారిన స్థానాలు ఎన్ని?  ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు నామినేషన్లు వేసిన నియోజకవర్గాలు ఏంటి అనే వాటిపై దృష్టి సారించారు.

 

తెలంగాణ  సీఎం ఆదేశాలతో  ఆయా సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల బలాబలాలతో పాటు స్వతంత్రులు, చిన్న పార్టీల నేతలపై పార్టీ శ్రేణులు ఫోకస్ పెట్టి ఆ వివరాలను కేసీఆర్ ముందు ఉంచుతున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఈ వివరాలను బట్టి అవసరమున్న చోట స్వతంత్రులకు సహకారం అందించడానికి, రెబల్స్‌ను బుజ్జగించి తమ దారిలోకి తెచ్చుకోవడానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు గులాబీ బాస్.

 

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఘట్టమైన నామినేషన్లు, స్క్రూటినీ ప్రక్రియ పూర్తయింది.స్క్రూటినీ తర్వాత బరిలో మిగిలే అభ్యర్థుల్లో బీఆర్‌ఎస్ రెబల్స్‌ను బుజ్జగించి దారికి తెచ్చుకోవడానికి గులాబీ బాస్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే  ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బరిలోకి దిగుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి దక్కని అసంతృప్త నేతలు కూడా ఎన్నికల రంగంలో దిగారు. మరికొందరు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కొన్ని స్థానాల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు.

 

తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు గాను 4, 798 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా వారిలో608 మంది నామినేషన్లను తిరస్కరించారు ఎన్నికల సంఘం అధికారులు. వీరిలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వివరాలు సేకరించిన బీఆర్ఎస్ నేతలు.. తాము విజయం సాధించడానికి కలిసి వచ్చే అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపు సాయంత్రం వరకూ అంటే నవంబర్ 13 వరకూ సమయం ఉండటంతో.. తమకు ఇబ్బంది కలిగించేలా ఉన్న స్వతంత్ర అభ్యర్థులను ఒప్పించి వారిని ఎలా అయినా పోటీ నుంచి తప్పించడానికి పావులు వేగంగా కదుపుతున్నారు.

 

అలాగే ప్రతిపక్ష పార్టీల నుంచి రెబెల్స్‌గా మారి బరిలో ఉన్న క్యాండిడేట్స్  వల్ల..తమ పార్టీకి  ఎక్కడ లాభం జరుగుతుందో కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇలాంటి స్థానాల్లో ఆ రెబల్స్‌కు సహకారం అందించి.. వాళ్ల ద్వారా బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూరే స్ట్రాటజీతో  ముందుకు పోతున్నారు బీఆర్ఎస్ అధినేత.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 11 =