ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహిళా నేతల హవా

Women candidates, in the election,women leaders, Warangal district,Telangana Assembly Elections 2023,TRS, Congress, Bjp,Konda Surekha, Seethakka,
Women candidates, in the election,women leaders, Warangal district,Telangana Assembly Elections 2023,TRS, Congress, Bjp,Konda Surekha, Seethakka,

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువ మంది మహిళా క్యాండిడేట్లను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో చూసుకుంటే 4 నియోజకవర్గాల్లో మహిళా నేతలను ఎన్నికల బరిలోకి దింపింది. ఇందులో   ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బిసీ మహిళలు కూడా అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓసీ సామాజిక వర్గం నుంచి  యశస్వినీరెడ్డి , ములుగులో ఎస్టీ సామాజిక వర్గం నుంచి  సీతక్క , స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎస్సీ నియోజకవర్గం నుంచి  సింగాపురం ఇందిర , వరంగల్ తూర్పులో బీసీ సామాజిక వర్గం నుంచి  కొండా సురేఖను పోటీలో వున్నారు. అయితే ఈ నలుగురు మహిళా అభ్యర్థులు కూడా నాలుగు రకాల సామాజికవర్గాల నేతలు కావడమే కాంగ్రెస్‌కు కలిసి వచ్చిన అంశంగా మారింది.

 

సామాజిక సమీకరణలు అమలు చేసే అధికార బీఆర్ఎస్ పార్టీ.. కేవలం ఒక్క ములుగు నియోజకవర్గంలో  బడే నాగజ్యోతిని రంగంలోకి దించింది.అలాగే బీజేపీ మూడు నియోజకవర్గాలలో.. మహిళా అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించింది. ఈ  2023  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మహిళా నేతలు ఎక్కువగా పోటీ చేస్తుండడంతో  ఈ విషయం  తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. అయితే ఎన్నికల బరిలో మహిళా నేతలుగా నిలబడ్డవారిలో కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువ మంది ఉన్నారు. ఇక అలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నాకూడా.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఎక్కువ సంఖ్యలోనే మహిళా నేతలు రంగంలోకి దిగారు.

 

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నాలుగు నియోజకవర్గాల్లో మహిళా నేతలను పోటీకి నిలిపారు. పాలకుర్తి, ములుగు,స్టేషన్ ఘన్‌పూర్‌, వరంగల్ తూర్పు నియోజకవర్గాల నుంచి  మహిళా క్యాండిడేట్లను రంగంలోకి దించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇందులో సీతక్క, కొండా సురేఖ ఈ ఇద్దరు నేతలు మాత్రమే రాజకీయ అనుభవం కలిగిన నేతలు..మిగిలిన ఇద్దరు నేతలిద్దరూ రాజకీయాల్లో కొత్తగానే వచ్చారు. భారతీయ జనతా పార్టీ కూడా వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి, డోర్నకల్ నియోజకవర్గాల్లో  ముగ్గురు మహిళా నేతలను పోటీలో నిలబెడుతోంది

 

వరంగల్ తూర్పు నియోజకవర్గం  నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ  పోటీ చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సురేఖ వైఎస్సార్ కేబినెట్లో మినిష్టర్‌గా పనిచేశారు. సురేఖ శాయంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో శాయంపేట నుంచి తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా సురేఖ.. బీజేపీ అభ్యర్థి అయిన దేవు సాంబయ్యపై 571 ఓట్ల స్వల్ప మెజార్టీతో  గెలిచారు.రెండోసారి కూడా శాయంపేట నియోజకవర్గం నుంచి 2004లో పోటీ చేసిన సురేఖ..  బీజేపీ అభ్యర్థి  జి.ప్రేమేందర్ రెడ్డిపై 44,240 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.

 

శాయంపేట నియోజకవర్గం రద్దు కావడంతో..కొండా సురేఖ 2009లో పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి అయిన మొలుగూరి భిక్షపతిపై 12,800 మెజార్టీతో గెలుపొంది.. వైఎస్సార్ కేబినెట్లో మంత్రి అయ్యారు. అయితే వైఎస్ రాజశేఖర్ మరణాంతరం సురేఖ కాంగ్రెస్‌ను వీడి, ఎమ్మెల్యే పదవికి  కూడా రాజీనామా చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి  చేరారు. 2012లో పరకాలలో జరిగిన బై ఎలక్షన్స్‌లో వైఎస్సార్సీపీ నుంచి  పోటీ చేసిన  సురేఖ.. టీఆర్ఎస్ అభ్యర్థి  మొలుగూరి భిక్షపతి చేతిలో ఓడిపోయారు.

 

చివరకు అనేక రాజకీయ పరిణామాలతో ‘కొండా’ దంపతులు గులాబీ కండువా కప్పుకున్నారు.  2014లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో..కొండా సురేఖ  టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి..అప్పుడు  మంత్రిగా ఉన్న  కాంగ్రెస్ నేత బస్వరాజ్ సారయ్యపై 55 వేల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సాధించారు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవిని ఆశించి భంగపడి..పార్టీని వీడి  చివరకు సొంతగూడు అయిన కాంగ్రెస్ పంచనే చేరారు.

 

మళ్లీ పరకాల నియోజక వర్గం నుంచి  2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సురేఖ..46 వేల భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతోనే తాను పరకాల నియోజకవర్గాన్ని వీడుతున్నట్లు ప్రకటించిన  కొండా సురేఖ.. భవిష్యత్తులో వరంగల్ తూర్పు నుంచే పోటీ చేస్తామని ప్రకటించారు. అలా ఇప్పుడు జరుగుతున్న తాజా శాసనసభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి సురేఖ పోటీ చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − nine =