ఇప్పుడు బీఆర్ఎస్ పంచన చేరిన టీడీపీ ముఖ్య నాయకులు

Leaders who once turned the wheel in TDP Now the main leaders of TDP who have joined BRS Panchana,Leaders who once turned the wheel in TDP,Now the main leaders of TDP,who have joined BRS Panchana,Mango News,Mango News Telugu,Leaders, TDP,main leaders, BRS ,Nagam Janardhan Reddy, Ravula Chandrasekhar, Manda Jagannath,KCR,Telengana Assembly Elections 2023,Telengana Assembly Elections Latest News,Telengana Assembly Elections Latest Updates,Nagam Janardhan Reddy Latest News
Leaders, TDP,main leaders, BRS ,Nagam Janardhan Reddy. Ravula Chandrasekhar, Manda Jagannath,KCR,Telengana Assembly Elections 2023,

ఉమ్మడి  పాలమూరు జిల్లాలో ఒకప్పుడు  నాగం జనార్దన్ రెడ్డి. రావుల చంద్రశేఖర్, మందా జగన్నాథం  పొలిటికల్ హీరోలుగా ఓ వెలుగు వెలిగారు. రాజకీయాల్లో అందవేసిన చేతులుగా గుర్తింపు పొందారు. అప్పట్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కుడిభుజాలుగా ఉంటూ చక్రం తిప్పిన నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఒకప్పుడు తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న ఈ నేతలందరూ.. ఇప్పుడు కేసీఆర్ పంచన చేరి బీఆర్ఎస్‌ పార్టీలో కొనసాగుతున్నారు.

 

ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా  నాగం జనార్దన్ రెడ్డికి మంచి పేరుంది. నాగర్ కర్నూలు నుంచి టీడీపీ అభ్యర్థిగా నాగం జనార్దన్ రెడ్డి  1985 ఎన్నికల్లో, 1994 ఎన్నికల్లో, 1999 ఎన్నికల్లో, 2004 ఎన్నికల్లో, 2009 ఎన్నికల్లో, 2012 ఎన్నికల్లో వరుసగా ఆరు సార్లు విజయ ఢంకా మోగించారు. ఎన్‌టిఆర్‌తో బలమైన  స్నేహం కలిగిన ఈయన..ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబుకు కుడిభుజంగా ఉన్నారు. అనేక ముఖ్యమైన శాఖలకు మంత్రిగానూ పని చేశారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఈ పని  నాగం జనార్థన్ రెడ్డి చేశారు అనిపించేలా  తనదైన ముద్ర వేశారు.

 

అయితే  ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సమయంలో.. రాజకీయాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆయన తెలుగుదేశం పార్టీని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన బీజేపీలో కొనసాగారు. అక్కడ ఎంతో కాలం ఉండలేక  కాంగ్రెస్ గూటికి చేరి.. ఈ  2023 అసెంబ్లీ ఎన్నికల కోసం  టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ అక్కడ టికెట్ దక్కక పోవడంతో ..ఈ మధ్యనే  సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. ఒకప్పుడు టీడీపీలో హీరోగా వెలిగిన నేత ఇప్పుడు వేరువేరు పార్టీలలో చేరి తనకంటూ ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరి ఎన్నికల తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.

 

ఇక  మందా జగన్నాథం కూడా టీడీపీ సీనియర్ నేతగా ఓ చక్రం తిప్పిన నేతగా గుర్తింపు పొందారు.  సీనియర్ పొలిటిషియన్ అయిన ఆయన.. నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి 1996  లో జరిగిన ఎన్నికలలో, 1999 లో జరిగిన ఎన్నికల్లో ,అలాగే 2004, 2009 సంవత్సరాలలో  జరిగిన ఎన్నికలలో  టీడీపీ  నుంచి లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. పార్లెమంట్ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు.

 

అంతేకాదు తెలంగాణా ఉద్యమంలో కీలకంగా పని చేసిన గుర్తింపును కూడా మందా జగన్నాథం తెచ్చుకున్నారు. ఈ సమయంలోనే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత నంది యల్లయ్య చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుకుగా లేకపోయినా  కూడా బీఆర్ఎస్‌లోనే కొనసాగుతూ వచ్చారు.అయితే తన కుమారునికి 2014లో అలంపూర్ టికెట్ ఇప్పించుకున్నా కూడా గెలిపించుకోలేక పోయారు. అయినా కూడా

సీఎం కేసీఆర్  జగన్నాథంకు తెలంగాణ నుంచి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించగా..ఇంకా  అదే పోస్టులో కొనసాగుతున్నారు.

 

అలాగే టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి.  వనపర్తి జిల్లాలో రాజకీయ పలుకుబడితో తనకంటూ సొంత  గుర్తింపు తెచ్చుకున్న రావుల..  రాజకీయ మేధావి, సౌమ్యుడు,  ఏ విషయం అయినా క్షుణ్ణంగా విశ్లేషించగల నేతగా గుర్తింపు ఉంది. రావుల చంద్రశేఖర్‌రెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి 1994 ఎన్నికల్లోనూ, 2009 ఎన్నికల్లోనూ  టీడీపీ నుంచి శాసనసభకు ఎమ్మెల్యేగా గెలుపొందారు.  ఒకసారి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. టీడీపీలో సీనియర్ నేతగా ఎన్నో ఏళ్లు ఆ పార్టీలోనే  కొనసాగారు.

 

తెలంగాణా రాష్ట్రంగా అవతరించి రెండు రాష్ట్రాలువిడిపోయాక.. టీడీపీ నుంచి అందరూ వెళ్లిపోయినా కూడా  రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాత్రం పార్టీని నమ్ముకొనే ఉండిపోయారు. టీడీపీ  పొలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగుతూ…బాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ  వచ్చారు. అయితే ఈ మధ్యే  ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =