హైదరాబాద్ నగరవాసులకు సూచన.. రేపు, ఎల్లుండి కొన్ని MMTS రైళ్లు రద్దు

Many MMTS Services Cancelled Due To Technical Issues in Hyderabad For Next Two Days,MMTS Services Cancelled Due To Technical Issues,MMTS Services Cancelled Due To Technical Issues in Hyderabad,Hyderabad MMTS services,Hyderabad No MMTS services today ,Several MMTS trains in Hyderabad to be cancelled ,MMTS trains in Hyderabad ,MMTS trains in Hyderabad Cancelled ,MMTS trains ,mango news

హైదరాబాద్ నగరంలోని రైల్వే ట్రాక్స్ నిర్వహణ పనులను చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్స్ ట్రాక్‌ మెయింటనెన్స్‌ పనుల నేపథ్యంలో ఈరోజు రేపు వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేశామని అధికారులు ప్రకటించారు. లింగంపల్లి నుంచి నాంపల్లి రూట్‌లో నడిచే 9 సర్వీసులను, నాంపల్లి నుంచి లింగంపల్లి వైపు నడిచే మరో 9 సర్వీసులను రద్దు చేశారు. అంతేకాదు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లిలో నడిచే 8 సర్వీసులు నిలిపివేశారు.

అలాగే, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వైపు నడిచే మరో 8 సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక సికింద్రాబాద్‌ నుంచి లింగంపల్లి మార్గంలో ఒక సర్వీసుని, లింగంపల్లి నుంచి -సికింద్రాబాద్‌ రూట్‌లో నడిచే మరో సర్వీసును రెండు రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల నిర్వహణ పనుల కారణంగా ఈ ఎంఎంటీఎస్‌ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + seven =