నేతాజీ 125వ జయంతి సందర్భంగా.. ఇండియా గేట్ వద్ద విగ్రహం ఏర్పాటు: ప్రధాని మోదీ

Grand Netaji Statue At India Gate, India Gate to have Netaji statue soon, installed at India Gate, Mango News, Netaji Subhas Chandra Bose’s grand statue to be installed at India Gate, Netaji Subhash Chandra Bose’s grand statue, Netaji’s grand statue to be installed at India Gate, PM Modi, Statue of Subhash Chandra Bose, Statue of Subhash Chandra Bose to be Installed at India Gate, Subhas Chandra Bose Birth Anniversary

నేతాజీ సుభాష్ చంద్రబోస్.. స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం సలిపిన అతివాద నాయకులలో అగ్రగణ్యుడు. స్వాతంత్ర్యోద్యమంలో ఆయన చూపిన తెగువ, స్ఫూర్తిని గౌరవిస్తూ భారత ప్రభుత్వం ఆయనకు ఘననివాళులు అర్పించటానికి పూనుకుంది. నేతాజీ విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చెప్పారు. నేతాజీ 125వ జయంతిని యావత్తు దేశం జరుపుకుంటున్న వేళ గ్రానైట్‌తో తయారు చేసిన ఆయన విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామనే విషయాన్ని అందరితో పంచుకుంటుంన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. దీనిని, నేతాజీకి దేశం తరపున రుణం తీర్చుకోవడానికి.. ఇంకా కృతజ్ఞతాభావానికి ప్రతీక అని ప్రధాని మోదీ ట్వీట్‌లో తెలిపారు.

అద్భుతమైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం తయారీ పూర్తయ్యే వరకు ఇండియా గేట్ వద్ద ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ హోలోగ్రామ్ విగ్రహాన్ని జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా ఆవిష్కరిస్తానని తెలిపారు. మొదటి ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌ను నేతాజీ ఏర్పాటు చేశారు. 1943లో ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసి, బ్రిటిష్ ప్రభుత్వంపై సాయుధ తిరుగుబాటును ప్రారంభించారు. ‘నాకు నీ రక్తాన్ని ఇవ్వు.. నీకు నేను స్వాతంత్ర్యాన్ని ఇస్తాను’, ‘జైహింద్’ వంటి నినాదాలతో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనే విధంగా వేలాది మంది భారతీయులను ప్రేరేపించి, ఉత్తేజితులను చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − fourteen =