పంతం నెగ్గించుకున్న మల్లారెడ్డి.. రాజశేఖర్ రెడ్డికి మల్కాజ్‌గిరి టికెట్

Malkajgiri ticket for Mallareddy Rajasekhar Reddy,Malkajgiri ticket for Mallareddy,Mallareddy Rajasekhar Reddy,ticket for Mallareddy,Mango News,Mango News Telugu,brs, malkajgiri, telangana assembly elections, minister mallareddy, marri rajashekar reddy, brs ticket, kcr, mynampalli hanmantharao,Telangana Minister Malla Reddy,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Malkajgiri ticket Latest News,Malkajgiri ticket Latest Updates
brs, malkajgiri, telangana assembly elections, minister mallareddy, marri rajashekar reddy, brs ticket, kcr, mynampalli hanmantharao

కొద్దిరోజులుగా మల్కాజ్‌గిరిలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. మైనంపల్లి చర్యల వల్ల అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముందు నుంచి మైనంపల్లి బీఆర్ఎస్ నుంచి రెండు టికెట్లు ఆశించారు. కానీ అధిష్టానం మైనంపల్లికి టికెట్ ఇచ్చి.. అతని కొడుకు రోహిత్‌కు మొండిచేయి చూపించింది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్న మైనంపల్లికి.. కాంగ్రెస్ టికెట్ ఆఫర్ చేయడంతో.. ఆ పార్టీలోకి జంప్ అయ్యారు. తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి మైనంపల్లి బీఆర్ఎస్‌పై భగ్గుమంటున్నారు. ఎదిఏమైనా తాను, తన కొడుకు గెలిచి తీరుతామని సవాల్ విసురుతున్నారు.

అయితే ఈ పరిణామాల మధ్య మల్కాజ్‌గిరి టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. చాలా మంది ఆ టికెట్ కోసం పోటీ పడ్డారు. అటు మంత్రి మల్లారెడ్డి కూడా ఎప్పుడో ఆ స్థానంపై కన్నేశారు. తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని మల్కాజ్‌గిరి నుంచి బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. అధిష్టానం వద్ద కూడా తన అల్లుడికి టికెట్ కేటాయించాలని మల్లారెడ్డి పట్టుపట్టుకొని కూర్చుకున్నారు. హన్మంతరావు టికెట్ తిరస్కరించినప్పటి నుంచి మల్లారెడ్డి.. కేసీఆర్ వద్దే దీక్షించుకొని కూర్చుకున్నారు. తన అల్లుడికి టికెట్ ఇస్తే గెలిపించుకొని తీసుకొస్తానని కేసీఆర్‌తో మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.

చివరికి అనుకున్నది సాధించారు మల్లారెడ్డి. తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం మల్కాజ్‌గిరి టికెట్ కేటాయించింది. బుధవారం సీఎం కేసీఆర్.. రాజేశేఖర్ రెడ్డికి బీ ఫాం అందజేశారు. అయితే రాజేశేఖర్ రెడ్డి ముందు ఆ స్థానంపై ఆశపడ్డప్పటికీ.. ఆ తర్వాత ఆశలు వదులుకున్నారు. దీంతో మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారు.  ఈసమయంలో అనూహ్యంగా.. రాజశేఖర్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది.

మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి 2019 లోక్ సభ ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ తరుపున పోటీ చేశారు. కానీ అప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి బీఆర్ఎస్ తరుపున మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను రాజశేఖర్ రెడ్డి చూసుకుంటున్నారు. ఇప్పుడు మైనంపల్లి కాదనడంతో.. రాజశేఖర్ రెడ్డి మల్కాజ్‌గిరి టికెట్‌ను కేసీఆర్ కేటాయించారు. అయితే కొడుక్కి టికెట్ ఇవ్వలేదని పార్టీ మారడంతో.. హన్మంతరావు పట్ల నియోజకవర్గంలో కాస్త నెగిటివిటీ పెరిగిందట. అటు కేసీఆర్ కూడా ఎట్టి పరిస్థితిలోనైనా.. మైనంపల్లిని ఓడించాలని అస్త్రాలను రెడీ చేస్తున్నారు. ఈక్రమంలో మైనంపల్లిని రాజేశేఖర్ రెడ్డి ఓడిస్తారా?.. మళ్లీ మల్కాజ్‌‌గిరిలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + five =