ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి హరీష్ రావు

ప్రధాని మోదీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ధీటుగా బదులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ప్రధాని మోదీ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మంగళవారం నాడు మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈక్రమంలో.. అక్కన్నపేట మండలం పోతారంలో దళిత బంధు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు, తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని మోదీ చిత్తశుద్ధిని ప్రశ్నించారు. ఈరోజు పార్లమెంట్‌లో తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్‌పై స్పందించారు మంత్రి హరీష్ రావు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటుపై తన మనసులోని అక్కసునంతా బయటపెడుతున్నారని విమర్శించారు.

భద్రాచలంలోని ఏడు మండలాలను, పవర్ ప్లాంట్‌ను ఆంధ్రాలో కలిపింది ప్రధాని మోదీనే అని గుర్తుచేశారు. అసలు 2004 లోనే అప్పటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఉంటే ఇంతమంది బలిదానాలు చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదని హరీష్ తెలిపారు. మొన్న ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపారని, రాష్ట్రంపై వివక్ష ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించకపోవడం ప్రధాని మోదీ ద్వంద్వనీతికి నిదర్శనం అని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రధాని హోదాలో ఉండి కూడా మోదీ, ఉత్తర భారతానికి ఒక న్యాయం.. దక్షిణ భారతానికి మరో న్యాయం అన్నట్లు వివక్ష చూపిస్తున్నారని దుయ్యబట్టారు మంత్రి హరీష్ రావు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 13 =