ప్రధానమంత్రి హైద‌రాబాద్‌ పర్యటన: ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరైన పీఎం మోదీ

50th Anniversary Celebrations of ICRISAT, Hyderabad, ICRISAT, ICRISAT 50th Anniversary, ICRISAT 50th Anniversary Celebration, ICRISAT 50th Anniversary Celebration in Hyderabad, Mango News, Modi attend Icrisat golden jubilee event today, PM attend 50th anniversary of ICRISAT, PM Modi, PM Modi arrives in Hyderabad, PM Modi Attend 50th Anniversary Celebrations of ICRISAT, PM Modi Attends ICRISAT 50th Anniversary Celebration, PM Modi Attends ICRISAT 50th Anniversary Celebration in Hyderabad, PM Modi visit Hyderabad

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ ఒక్కరోజు పర్యటనలో భాగంగా.. హైద‌రాబాద్‌ విచ్చేశారు. శనివారం మధ్యాహ్నం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌రరాజ‌న్, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి స్వాగ‌తం ప‌లికారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ఇక్రిశాట్‌ స్వ‌ర్ణోత్స‌వ వేడుకలలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమం అనంతరం.. ముచ్చింత‌ల్‌లోని చినజీయ‌ర్ స్వామి వారి ఆశ్ర‌మం శ్రీరామనగరానికి చేరుకుని ‘సమతామూర్తి’ విగ్రహాన్ని ఆవిష్క‌రణ చేయనున్నారు ప్రధాని మోదీ.

ప్రధాని మోదీ ఇక్రిశాట్ సందర్శన

మొదటగా.. శంషాబాద్ నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్ కు చేరుకున్నారు ప్రధాని మోదీ. మొదటగా ఇక్రిశాట్ లో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సందర్శించారు ప్రధాని. రెయిన్ వాటర్ మేనేజ్ మెంట్ పై రూపొందించిన వీడియోను తిలకించారు మోదీ. ఈ కార్యక్రమంలో.. కేంద్ర మంత్రి తోమర్ కూడా  పాల్గొన్నారు. ఇక్రిశాట్ ఏర్పాటు అయి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న స్వ‌ర్ణోత్స‌వ వేడుకలలో పాల్గొన్నారు మోదీ. ఈ సంద‌ర్భంగా ఇక్రిశాట్ నూత‌న లోగోను, ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్క‌రించారు ప్ర‌ధాని మోదీ. ఇక్కడి శాస్త్రవేత్తలతో పరిశోధన సంబంధిత విషయాలను తెలుసుకున్నారు ప్రధాని మోదీ. శాస్త్రవేత్తలు సృష్టించిన కొత్త వంగడాలను పరిశీలించారు.

ప్రధాని మోదీ ప్రసంగం

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ప్రధాని మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. “వసంత పంచమి సందర్భంగా.. స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. ఇక్రిశాట్‌ 50 ఏళ్ల ప్రయాణం పెద్ద మైలురాయని ప్రధాని పేర్కొన్నారు. వ్యవసాయంలో మనది అత్యంత ప్రాచీన దేశం. 80% ఉన్న సన్నకారు రైతులపైనే శాస్త్రవేత్తలు దృష్టి పెట్టాలి. భవిష్యత్తు అంతా డిజిటల్ అగ్రికల్చర్ దే. అలాగే, నేచురల్ ఫార్మింగ్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కెమికల్ ఫ్రీ, ఆధునిక వ్యవసాయం వైపుగా సాగాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వ్యవసాయ అభివృద్ధిలో ఇక్రిశాట్ పాత్ర ఎంతో ఉంది. అలాగే, భవిష్యత్తు కోసం సరికొత్త సంకల్పంతో ఇక్రిశాట్‌ మరింత ముందుకు సాగాలి” అని అన్నారు  ప్రధాని మోదీ.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =