సీఎం కేసీఆర్ ఆదేశాలతో తిరుమ‌ల‌గిరి సాగ‌ర్‌ లో భూసమస్యల పరిష్కారంపై సమావేశం

Minister Jagadish Reddy and CS Held Review Meeting on Tirumalagiri Sagar Mandal Land Issues,Mango News,Mango News Telugu,Minister Jagadish Reddy And CS Somesh Kumar holds review meeting on Tirumalagiri Sagar Mandal land issues,Minister Jagadish Reddy And CS Holds Review Meeting on Tirumalagiri Sagar Mandal Land Issues,Minister Jagadish Reddy & CS Holds Review Meeting on Tirumalagiri Sagar Mandal Land Issues,KCR Directs Officials To Resolve Land Issues At Thirumalagiri Sagar Mandal Villages In Nalgonda

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు నల్లగొండ పర్యటన సందర్భంగా తిరుమలగిరి సాగర్ మండలంలో 5 గ్రామాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సమస్యను వెంటనే పరిష్కరించే నిమిత్తం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జి. జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల సీఐజీశ్రీ శేషాద్రి, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఐఆర్ఎస్, ఎండీ జి.టి వెంకటేశ్వర్ రావు, సీసీఎల్ఏ స్పెషల్ ఆఫీసర్ సత్యశారదలతో సమావేశం నిర్వహించారు.

తిరుమల సాగర్ మండలంలోని నెల్లికల్, చింతలపాలెం, తునికినూతల, జమ్మన్నకోట, ఎల్లాపురం(సుంకిషాల తండా) గ్రామాలలో 3495 ఎకరాల భూమికి సంబంధించి ఎంజాయ్‌మెంట్ స‌ర్వేను వెంటనే చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ కు ఈ సమావేశంలో నిర్ధేశించారు. డ్రాప్ట్ లిస్ట్ ను పబ్లిస్ చేసి అభ్యంతరాలుంటే, వెంటనే పరిష్కరించనున్నారు. తదనంతరం అర్హులైన ల్యాండ్ హోల్డర్లకు పట్టాలు, పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడం జరుగుతుంది. మొత్తం ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. దీని వలన 1700 మంది పేద రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు పొందేలా లబ్ధి చేకూరుతుంది. దీనివలన వారికీ రైతు బంధు, రైతుభీమా ప్రయోజనాలు పొందేలా అవకాశం కలుగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − two =