టీఎస్ఆర్టీసీ కార్గోసేవల్లో మరో ముందడుగు, పార్శిల్స్ హోమ్ డెలివరీ సర్వీసు ప్రారంభం

TSRTC Cargo Parcels Home Delivery Services Started In Twin Cities,TSRTC Introduces Home Delivery Of Parcels,Hyderabad,TSRTC Launched The Parcel Service,Wheeling Out Of Crisis RTC Rolls Out Door Delivery Of Parcels,Minister Puvvada Ajay,TSRTC Cargo Parcels,TSRTC Cargo Parcels Home Delivery Services,Home Delivery Services Started in Twin Cities,Home Delivery Services,TSRTC Cargo Parcels Home Delivery Services In Hyderabad,TSRTC Launches Cargo Services,TSRTC Launches Home Delivery Of Parcels,TSRTC Launches Home Delivery Services in Hyderabad,Mango News,mango News Telugu,TSRTC,TSRTC Latest News

తెలంగాణ ఆర్టీసీ గత జూన్ నుంచి పార్శిల్స్, కొరియర్, కార్గో సర్వీసు సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సేవల్లో మరో ముందడుగు వేస్తూ టీఎస్ఆర్టీసీ పార్శిల్స్ ‘హోమ్ డెలివరీ సర్వీసు’ ను కూడా ప్రారంభించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం నాడు ఖైరతాబాద్ లోని ట్రాన్స్ పోర్ట్ భవన్ లో పార్శిల్స్ హోం డెలివరీ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. తొలి దశలో భాగంగా జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో పార్శిల్ హోం డెలివరీ సర్వీస్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించారు.

టీఎస్ఆర్టీసీ కార్గోసేవల్లో భాగంగా ఇప్పటివరకు జంటనగరాలకు సంబంధించిన పార్శిల్స్ ఎంజిబిఎస్, జెబిఎస్ ల నుంచి తీసుకెళ్లడం జరిగేది. అయితే, హైదరాబాద్, సికింద్రాబాద్ లలో పార్శిల్స్ ను హెూం డెలివరీ సదుపాయం విషయంపై గత అక్టోబరు నెలలో ఆ బస్ స్టేషన్ల వద్ద సర్వే చేయగా, 89.92 శాతం వినియోగదారులు మొగ్గుచూపినట్టు తెలిపారు. ఈ క్రమంలో నూతన అధ్యాయనంగా ప్రప్రథమంగా జంటనగరాలలో వినియోగదారుల చెంతకే హోమ్ డెలివరీ సదుపాయాన్ని తీసుకురావడం జరుగుతోందని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంజిబిఎస్, జెబిఎస్ కు వచ్చిన పార్శిల్స్ ను పిన్ కోడ్ ల వారీగా వేరు చేసి నియమించిన ఏజెంట్ల ద్వారా నేరుగా సంబంధిత వినియోగదారుల ఇంటి వద్దనే డెలివరీ చేయనున్నట్టు తెలిపారు. హోమ్ డెలివరీ విధానంలో అనుభవం ఉన్న డుంజో డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, స్మార్ట్ షిప్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అడ్నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని చెప్పారు. పడమర దిశలో కూకట్‌పల్లి, గచ్చిబౌలి, సైబరాబాద్ ప్రాంతాలకు సంబంధించి డుంజో, సికింద్రాబాద్ ఏరియాకు చెందిన పార్శిల్స్ ను స్మార్ట్ షిప్ లాజిస్టిక్, హైదరాబాద్, ఓల్డ్ సిటీ సెక్టార్లలో అడ్నిగమ్ ఏజెన్సీలు పార్శిల్స్ ను వినియోగదారుల ఇంటి వద్దనే డెలివరీ చేయనున్నాయని మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − thirteen =