కొత్త మున్సిపాలిటీల్లో ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళాల నిర్వహణ – మంత్రి కేటిఆర్

Minister KTR,Municipalities,KTR Review Meeting on Municipalities,KTR Review Meeting,KTR Latest News,KTR Minister Review Meeting with GHMC Officials,Telangana IT Minister KTR,Telangana,Telangana News,Telangana Political Updates

మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలపై జూన్ 18, గురువారం నాడు రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, ప్రస్తుతం కొత్త మున్సిపాలిటీల్లో ఉన్న ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని వినియోగించుకునేలా ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళాలను పురపాలక శాఖ నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే ఈ అవకాశం కేవలం నూతన మున్సిపాలిటీలు, మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలకు మాత్రమే అని గతంలోనే మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. కొత్త మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ అవకాశం పైన విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎల్ఆర్ఎస్ గడువు సెప్టెంబర్ వరకు ఉన్నదని మంత్రి తెలిపారు. ఈ అవకాశం నూతనంగా ఏర్పడిన 43 నూతన మున్సిపాలిటీలకు కలుగుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు సంవత్సరాలలో మెజార్టీ జనాభా పట్టణాల్లో ఉండే అవకాశం ఉండడంతో పట్టణాల సమగ్రాభివృద్దిపైన దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని మంత్రి కేటిఆర్ చెప్పారు. ఇప్పటికే భారీ ఎత్తున జనాభా పట్టణాలలో కేంద్రీకృతమైన నేపథ్యంలో వాటిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. పౌర సేవలే కేంద్రంగా నూతన పురపాలక చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఈ చట్టంలోని విధులు అధికారాలు ఖచ్చితంగా పాటించేలా అధికారులు పని చేయాలన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మరియు స్థానిక ఎమ్మెల్యేలు హజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాలుగా మారిన నారాయణపేట, గద్వాల్ జిల్లా కేంద్రాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మూడు జిల్లాల పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, గ్రీనరీ, స్మశానాలు వంటి ప్రాథమిక అంశాలపైన శ్రద్ధ వహించాలని అధికారులకు సూచన చేశారు. దీంతో పాటు ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టేందుకు పారిశుద్ధ్యంకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్లకు, చైర్మన్లకు ఆదేశాలిచ్చారు. టాయిలెట్స్, పుట్ పాత్ ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని మంత్రి కేటిఆర్ సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 17 =