ఏపీలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిషేధం, దీనిపై పాఠశాల నుంచే విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం – మంత్రి బొత్స సత్యనారాయణ

Minister Botsa Satyanarayana Says Ragging is Prohibited in AP We will Educate The Students About This From School Stage,Minister Botsa Satyanarayana About Ragging,Minister Botsa Says Ragging is Prohibited in AP,Students Educated About Ragging in AP,Students From School Stage in AP,Mango News, Mango News Telugu,Botsa Satyanarayana Son Accident,Ap Minister Botsa Satyanarayana,Botcha Satyanarayana Daughter,Botcha Satyanarayana Family,Botsa Satyanarayana Brothers,Botsa Satyanarayana Cast,Botsa Satyanarayana Daughter Name,Botsa Satyanarayana Education Qualification,Botsa Satyanarayana Election Results,Botsa Satyanarayana Minister Address,Botsa Satyanarayana Mobile Number,Botsa Satyanarayana Office Address,Botsa Satyanarayana Which Minister,Minister Botsa Satyanarayana

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌పై నిషేధం అమలులో ఉందని, దీనిపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సోమవారం ఆయన విజయవాడలో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పాఠశాలలు మరియు కళాశాలలు అనేవి చక్కటి జీవన ప్రమాణాలను బోధించేలా ఉండాలని, విద్యార్థుల మధ్య ద్వేష భావాలు, అసమానతలు పెంచుకునే పరిస్థితులు ఉండకూడదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌పై నిషేధం విధించామని, విద్యార్థులకు ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా వెంటనే టీచర్ల దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. ఇక విద్యార్థుల యూనిఫామ్‌లో త్వరలోనే మార్పులు చేయనున్నామని, హుందాగా ఉండేలా రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే అన్ని తరగతి గదుల్లో విద్యాబోధన కోసం స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =