మోదీ ప్రభుత్వం ఇకనైనా పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌ తొలగించాలి – మంత్రి కేటీఆర్

Minister KTR Demands Modi Govt Should Remove The Cess on Petrol and Diesel, Telangana Minister KTR, Prime Minister Modi, KTR Demands Remove Cess on Petrol and Diesel, Mango News, Mango News Telugu, Minister KTR, PM Modi, Petrol and Diesel Cess, KTR Slams Modi on Cess, Petrol and Diesel Cess In Telangana, Petrol and Diesel Cess In AP, National Party BRS, TRS PArty Chief KCR, TRS Working President KTR, KTR LAtest News And Updates

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం ఆయన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన లారీ యజమానుల, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రవాణా రంగంలోని సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం అర్థం చేసుకుందని, వారి విషయంలో తాము సానుకూలంగానే ఉన్నామని తెలిపారు. చాలా రాష్ట్రాలు పన్ను పెంచకపోయినా మోదీ సర్కార్ చమురు ధరలు పెంచిందని, కేంద్రమే అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ విధించి, రూ. 30 లక్షల కోట్లను తీసుకుందని విమర్శించారు. ఇన్నిరోజులపాటు మోదీ సర్కార్‌ దోచుకున్నది చాలని, ఇకనైనా పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌ను తొలగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో ఎన్నడూ కులం, మతం చూడలేదని, అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్‌ సర్కార్‌ పనిచేస్తోందని తెలిపారు. పారిశ్రామికీకరణలో ప్రపంచ నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడుతోందని, ఉపాధి కల్పనలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అయితే కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆయిల్ కంపెనీలకు రూ. 22 వేల కోట్ల రాయితీలు ఇచ్చారని, ప్రజలకు మాత్రం ఉన్న రాయితీలు తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఒకవైపు గ్యాస్ సిలిండర్ల ధరలు పెంపు, మరోవైపు ఇంధన ధరలు భారీగా పెంచడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీలిండర్ల ధరలతో పాటు దేశవ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌ను రూ. 70కి, లీటర్‌ డీజిల్‌ను రూ. 65కు ఇవ్వాలని కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 1 =