ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2021 అవార్డు: నామినేట్ అయిన నలుగురు ఆటగాళ్లు వీళ్ళే…

ICC Reveals Nominees for Men's Test Player of the Year-2021 Award, Mango News, Mango News Telugu, Latest Sports News 2021, ICC Reveals Nominees for Men's, Men's Test Player of the Year-2021 Award, Men's Test Player of the Year, ICC Awards 2021, ICC Awards, Nominees for ICC Men's Test Player of the Year, ICC names nominees for Men's Test Player of the Year, ICC Test Player of the Year 2021, icc player of the year 2021, icc awards 2021 nominees, icc awards 2021 winners list

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం నాడు పురుషుల టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2021 అవార్డు నామినీలను ప్రకటించింది. ఈ అవార్డు కోసం మొత్తం నలుగురు నామినేట్ అయినట్టు ఐసీసీ ప్రకటించింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, భారత్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమిసన్, శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కోసం నామినేట్ అయినట్టు తెలిపారు.

ఈ ఏడాది జో రూట్ మొత్తం 15 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆరు సెంచరీలతో 1708 పరుగులు చేశాడు. అశ్విన్ 8 మ్యాచ్‌ల్లో 16.23 సగటుతో 52 వికెట్లు తీశాడు. అలాగే ఒక సెంచరీతో పాటుగా 28.08 సగటుతో 337 పరుగులు చేశాడు. ఇక కైల్ జామీసన్ 5 మ్యాచ్‌ల్లో 17.51 సగటుతో 27 వికెట్లు, 17.50 సగటుతో 105 పరుగులు చేయగా, దిముత్ కరుణరత్నే 7 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సహాయంతో 69.38 సగటుతో 902 పరుగులు చేశాడు. వీరిలో టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2021 అవార్డు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =