సిరిసిల్లలో గోక‌ల్‌దాస్ ఇమేజెస్ అపారెల్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

10000 will get jobs at Apparel Park, Apparel Factory, foundation Stone for GokalDas Images Apparel Factory, foundation Stone for GokalDas Images Apparel Factory in Sircilla, Gokaldas Images Apparel Factory, Mango News, Minister KTR, Minister KTR Lays foundation Stone for GokalDas, Minister KTR Lays foundation Stone for GokalDas Images Apparel Factory in Sircilla, Sircilla, Telangana Min KTR lays foundation stone for Gokaldas, Telangana Min KTR lays foundation stone for Gokaldas Images Apparel Factory

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దూర్ అపారెల్ పార్కులో గోకల్ దాస్ ఇమేజెస్ సంస్థ నిర్మించ తలపెట్టిన అపారెల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గోకల్ దాస్ ఇమేజెస్ సంస్థ ఎండీ సుమీర్ హిందూజా, చేనేత మరియు జౌళి శాఖ సంచాలకులు శైలజ రామయ్యర్, టీఎస్ఐఐసి వైస్ చైర్మన్ మరియు ఎండీ వి. నరసింహా రెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, సిరిసిల్ల‌లో అపారెల్ పార్కు ఉండాల‌నేది ఈ ప్రాంత ప్ర‌జ‌లు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారని చెప్పారు. 2005లో నాటి ప్రభుత్వం అపారెల్ పార్కు పెడుతామ‌ని హామీ ఇచ్చింది కానీ అమ‌లు చేయ‌లేదన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ రోజు అందుకు బీజం ప‌డిందని అన్నారు. ఈ అపారెల్ పార్కులో రాబోయే రోజుల్లో 10 వేల మంది ఉపాధి పొందబోతున్నారని, అందులో 80 శాతానికి పైగా మ‌హిళ‌ల‌కే ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌న్నారు. బ‌తుక‌మ్మ చీర‌లు, గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ యూనిఫాం ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయన్నారు. దీంతో నేత‌న్న‌ల ఆదాయం పెరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here