అంశాల స్వామికి పక్కా ఇల్లు నిర్మించి అందించండి, కలెక్టర్ కు మంత్రి కేటీఆర్ ఆదేశం

Amshala Swamy Fluoride Victim, Build House for Fluoride Victim Amshala Swamy, Fluoride Victim Amshala Swamy, House for Fluoride Victim Amshala Swamy, KTR, KTR helps fluoride victim with house, KTR Orders Nalgonda District Collector to Build House for Fluoride Victim, Mango News, Minister KTR, Minister KTR Orders Nalgonda District Collector, Nalgonda Fluoride Victim Amshala Swamy

నల్గొండ ఫ్లోరైడ్ ముఖచిత్రంగా దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి శుక్ర‌వారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిశారు. ఈ సందర్భంగా స్వామి యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. గతంలో అంశాల స్వామి జీవనాధారం కోసం ప్రత్యేకంగా ఒక షాప్ (సెలూన్) ని మంత్రి ఏర్పాటు చేయించారు. తాజాగా అంశాల స్వామికి పక్కా ఇల్లు నిర్మించి అందించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వం త‌ర‌పున‌ అంశాల స్వామికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా స్థానిక జిల్లా కలెక్టర్ ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్‌ను ఆదేశించారు. స్వామికి ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్య‌త‌ను తీసుకోవాల్సిందిగా పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ కు అప్ప‌గించారు.

మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తన సొంత ఊరు పరిసర గ్రామ నివాసి అయిన అంశాల స్వామికి పక్కా ఇల్లు అందించేందుకు విద్యాసాగర్ ముందుకొచ్చారు. ఇంటి నిర్మాణ బాధ్యత తీసుకునేందుకు ముందుకు వచ్చిన కర్నాటి విద్యాసాగర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. గతంలో తన జీవనం సాగేందుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తగిన ఏర్పాట్లు చేసిన మంత్రి కేటీఆర్, ఇప్పుడు తన సొంత ఇంటి కల నెరవేర్చుతుండ‌టంపై స్వామి సంతోషం వ్య‌క్తం చేస్తూ కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ సమస్య నుంచి క్రమంగా విముక్తి లభిస్తున్న‌ట్లు తెలిపిన స్వామి, సీఎం కేసీఆర్‌ను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలుప‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twenty =