డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్న మంత్రి కేటిఆర్

KTR, Minister KTR, Minister KTR will Hand over More than 1150 2BHK Houses, Telangana 2BHK Houses, Telangana 2BHK Houses News, Telangana 2BHK Houses Scheme, Telangana 2BHK Houses Updates, Telangana 2BHK Housing Scheme

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మరియు చుట్టూ పక్కల ప్రాంతాల్లో దాదాపు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కావొస్తుంది. ఈ నేపథ్యంలో ద‌‌స‌రా పండుగ సందర్భంగా ఇప్పటికే పూర్తైన 1152 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల మంత్రి కేటిఆర్ ఈరోజు ప్రారంభించ‌నున్నారు. హైద‌రాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించి ప్రజలకు అందించనున్నారు. జియాగూడ‌లోని 840 ఇళ్లు, క‌ట్టెల మండిలో 120 ఇళ్లు, గోడే కి క‌బ‌ర్‌లో 192 ఇళ్లను మంత్రి ప్రారంభిస్తారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభోత్స‌వం కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ ప‌ద్మారావు, రాష్ట్ర మంత్రులు మ‌హ‌మూద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, ఇతర నగర ప్రజాప్రతినిధులు పాల్గొన‌నున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =