అమెరికా ‘ఆటా’ సభలకు ఆహ్వానం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Minister Talasani Srinivas Yadav Received The Invitation From ATA Association of US,Mango News,Mango News Telugu,Minister Talasani Srinivas Yadav,Talasani Srinivas Yadav,Minister Talasani,ATA Association of US,ATA Association,US ATA Association,Talasani Srinivas Yadav Received The Invitation From US ATA Association,Talasani Srinivas Yadav Received The Invitation From ATA Association of US,Talasani Srinivas Yadav Latest News,Minister Talasani Srinivas Yadav News,Minister Talasani Srinivas Yadav Latest Updates,Minister Talasani Srinivas Yadav Live News,Minister Talasani Srinivas Yadav Speech,Minister Talasani Srinivas Yadav ATA Association,ATA Association

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య మరియు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అమెరికా లోని ‘ఆటా’ అసోసియేషన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. వాషింగ్టన్ వేదికగా జులై నెలలో జరుగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహా సభలలో పాల్గొనాల్సిందిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఆహ్వానం అందుకున్నారు. సోమవారం మాసాబ్ టాంక్ లోని తన కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను ‘ఆటా’ ప్రతినిధులు సత్యనారాయణ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు కలిసి ఇన్విటేషన్ కార్డ్ అందజేశారు. జులై నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరుగనున్న వేడుకలకు హాజరు కావాలని మంత్రిని వారు కోరారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. విదేశాలలో నివసిస్తున్నా మన సంస్కృతి, సాంప్రదాయాలను మరిచిపోకుండా తరువాతి తరాలకు వాటి ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా వేడుకలు నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ఈ వేడుకలు నిర్వహించలేకపోయామని ‘ఆటా’ ప్రతినిధులు తెలియజేశారని, అయితే ఈసారి ఎలాంటి ఆటంకం లేకుండా వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అమెరికాలోని తెలుగు వారందరూ ఒక చోట కలుసుకోవడం, వారితో పాటు సొంత రాష్ట్రాలలోని వారి కుటుంబ సభ్యులకూ ఎంతో సంతాషాన్నిస్తుందని మంత్రి తలసాని అభిప్రాయపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =