మునుగోడు రిజల్ట్స్: ఘనవిజయం వైపు దూసుకువెళ్తున్న టీఆర్ఎస్

Munugode Bye-election Result: Counting of Votes Underway,Munugode Bye-election Result,TRS Party Candidate Kusukuntla Prabhakar Reddy,Munugode Bye-election,Mango News,Mango News Telugu, Munugode Bypoll, Munugode Bypoll Elections, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode Election Schedule Release, Telangna Bjp Party, Telangna Congress Party, Trs Cadre For Working In Munugode By-Poll, Trs Working President Ktr, Trs Working President Ktr Thanked Party Leaders Cadre For Working In Munugode By-Poll, Ysrtp

మునుగోడులో 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఈ ఉపఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఘన విజయం వైపు దూసుకువెళ్తున్నారు. 12 రౌండ్స్ కౌంటింగ్ అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీకి 8,678 ఓట్ల ఆధిక్యం లభించింది. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ కు 7,448 ఓట్లు, బీజేపీకి 5,448 ఓట్లు లభించాయి.

మునుగోడులో 11వ రౌండ్ లో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ముందంజలో ఉన్నారు. 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 7,235, బీజేపీకి 5,877 ఓట్లు పోలయ్యాయి. 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీకి 1,361 ఓట్ల ఆధిక్యం లభించింది. 11వ రౌండ్‌ కౌంటింగ్‌ అనంతరం టీఆర్‌ఎస్‌ 5,774  ఓట్ల ఆధిక్యంలో ఉంది.

మునుగోడులో ఇప్పటివరకు 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. అధికార పార్టీ టీఆర్ఎస్ దూసుకెళ్తుంది. 10 రౌండ్ల కౌంటింగ్ అనంతరం తన సమీప బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 4,440 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పదో రౌండ్ లో టీఆర్‌ఎస్ కు‌ 7503, బీజేపీకి 7015, కాంగ్రెస్ కు 1347 ఓట్లు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు టీఆర్‌ఎస్ కు మొత్తం 67,363, బీజేపీకి 62,923, కాంగ్రెస్‌ కు 17627 ఓట్లు లభించాయి.

తొమ్మిదో రౌండ్:

  • టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 7497 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 59860
  • బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 6665 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 55908
  • కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి వచ్చిన ఓట్లు: 1300 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 16280

మునుగోడు ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దూసుకెళ్తున్నారు. కౌంటింగ్ ప్రారంభం అయ్యాక రెండు, మూడు రౌండ్లలో మినహా మిగిలిన అన్ని రౌండ్లలో ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎనిమిది రౌండ్ల కౌంటింగ్ అనంతరం తన సమీప బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 3,100 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎనిమిదో రౌండ్ లో టీఆర్‌ఎస్ కు‌ 6620 బీజేపీకి 6088, కాంగ్రెస్‌కి ‌907 ఓట్లు లభించాయి. దీంతో ఇప్పటివరకు టీఆర్‌ఎస్ కు మొత్తం 52,343, బీజేపీకి 49,243, కాంగ్రెస్‌ కు 14596 ఓట్లు లభించాయి.

ఏడో రౌండ్:

  • టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 7202 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 45723
  • బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 6803 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 43155
  • కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి వచ్చిన ఓట్లు: 1664 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 13689

ఆరో రౌండ్:

  • టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 6016 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 38521
  • బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 5378 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 36352
  • కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి వచ్చిన ఓట్లు: 1962 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 12025

మునుగోడులో ఓట్ల లెక్కింపులో భాగంగా ఐదో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. ఐదో రౌండ్ కౌంటింగ్ అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఐదో రౌండ్లో బీజేపీకి 5245, టీఆర్‌ఎస్ కు‌ 6062, కాంగ్రెస్ కు 2683 ఓట్లు లభించాయి. ఐదో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 32505, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 30974, కాంగ్రెస్ అభ్య‌ర్థి పాల్వాయి స్రవంతికి 10063 ఓట్లు లభించాయి. ఐదు రౌండ్ల అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి 1531 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

రౌండ్స్ వారీగా ఓట్లు:

బీజేపీ: తొలిరౌండ్ (5126), రెండో రౌండ్ (8622), మూడో రౌండ్ (7426), నాలుగో రౌండ్ (4555)
టీఆర్ఎస్ : తొలిరౌండ్ (6418), రెండో రౌండ్ (7781), మూడో రౌండ్ (7390), నాలుగో రౌండ్ (4854)

మునుగోడు కౌంటింగ్ ప్రక్రియలో నాలుగో రౌండ్ ముగిసింది. నాలుగో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 26443, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 25729, కాంగ్రెస్ అభ్య‌ర్థి పాల్వాయి స్రవంతికి 7380 ఓట్లు లభించాయి. నాలుగు రౌండ్ల అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి 714 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాలుగో రౌండ్ లో బీజేపీకి 4555, టీఆర్‌ఎస్ కు‌ 4854, కాంగ్రెస్‌కి ‌1817 ఓట్లు లభించాయి.

రౌండ్స్ వారీగా ఓట్లు:

  • బీజేపీ: తొలిరౌండ్ (5126), రెండో రౌండ్ (8622), మూడో రౌండ్ (7426)
  • టీఆర్ఎస్ : తొలిరౌండ్ (6418), రెండో రౌండ్ (7781), మూడో రౌండ్ (7390)

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మూడో రౌండ్ లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్ లో బీజేపీకి 7426, టీఆర్‌ఎస్ కు‌ 7390, కాంగ్రెస్‌కి ‌1926 ఓట్లు లభించాయి. కాగా మూడు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ పార్టీ లీడ్ 415 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మునుగోడులో రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 14,199, బీజేపీ అభ్య‌ర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 13748, కాంగ్రెస్ అభ్య‌ర్థి పాల్వాయి స్రవంతికి 3637 ఓట్లు లభించాయి. రెండు రౌండ్ల అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి 451 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మునుగోడులో మొదటి రౌండ్ కౌంటింగ్ ముగిసింది. మొదటి రౌండ్ అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 1352 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్‌ఎస్ కు‌ 6418, బీజేపీకి 5126, కాంగ్రెస్ కు 2100 ఓట్లు లభించాయి.

మునుగోడులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ కు ఆధిక్యం. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 698 కాగా , ఇందులో టీఆర్ఎస్‌ అభ్యర్థికి 228 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 224 ఓట్లు, బీఎస్పీ కు 10 ఓట్లు వచ్చాయి.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ నెలకొల్పిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పక్రియ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. నల్గొండ పట్టణ శివారులోని ఆర్జాలబావి వద్ద ఉన్న స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గౌడౌన్స్ లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ముందుగా 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించా రు. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుండగా, ఒకే హళ్లో 21 టేబుళ్లపై కౌంటింగ్ జరుగనుంది. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్‌ కేంద్రాల చొప్పున కౌంటింగ్‌ చేపట్టనున్నారు. ఇక గంటకు 3 నుంచి 4 రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అలాగే 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కించనున్నారు. పూర్తిస్థాయి కౌంటింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూర్తయి, ఎవరు విజయం సాధించారో ప్రకటన విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. మునుగోడు నియోజకవర్గంలో నవంబర్ 3న జరిగిన పోలింగ్ లో రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైంది. మునుగోడు నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,41,805 ఓటర్లు ఉండగా, 93.13 శాతం అనగా 2,25,192 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ముందుగా తొలి రౌండ్‌ చౌటుప్పల్‌ మండలం నుంచి ప్రారంభమైంది. అనంతరం నియోజకవర్గపరిధిలోని నారాయణపురం, మునుగోడు, చండూరు, గట్టుప్పల్‌, మర్రిగూడెం, నాంపల్లి, మండలాలలో పోలైన ఓట్లను లెక్కించనున్నారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

మునుగోడు పోరులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, టీజేఎస్ సహా వివిధ పార్టీలు, అలాగే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, ఇతర స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 47 మంది బరిలో నిలిచినప్పటికీ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. మునుగోడులో ప్రజా తీర్పు ఎవరివైపు ఉండబోతుందో, ఏ పార్టీ జెండా ఎగురవేయబోతుందో మరికొన్ని గంటల్లో తేలనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 4 =