ఢిల్లీలో నేడు మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో రౌండ్‌ టేబుల్ సమావేశం.. హాజరుకానున్న పలు ప్రతిపక్ష పార్టీలు

BRS MLC Kavitha To Preside Over Round Table Meeting on Women's Bill in Parliament at Delhi Today,BRS MLC Kavitha Over Round Table Meeting,Round Table Meeting on Womens Bill,Womens Bill in Parliament Today,BRS MLC Kavitha on Womens Bill at Delhi,Mango News,Mango News Telugu,BRS MLC Kavitha To Hold Round Table Conference,Necessary to bring Women's Reservation Bill,MLC K Kavitha Latest News,Womens Reservation Bill Live News,Telangana Womens Reservation Bill Updates,Telangana Womens Reservation Bill,Kalavakuntla Kavitha News,Telangana Latest News And Updates

భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యూఢిల్లీ చేరుకున్నారు. బుధవారం ఆమె నేతృత్వంలో మహిళా బిల్లుపై రౌండ్‌ టేబుల్ సమావేశం జరుగనుంది. ఈ భేటీకి పలు ప్రతిపక్ష పార్టీలు సహా ప్రముఖ ప్రజా సంఘాలు హాజరుకానున్నాయి. అలాగే ఈ సమావేశానికి భారత్ జాగృతి సంస్థ ప్రతినిధులు కూడా భారీగా హాజరు కానున్నారు. ఢిల్లీలోని మెరిడియన్ హోటల్‌లో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఈ సమావేశం జరుగనుంది. దీనిలో ప్రధానంగా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలనే అంశంపై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఎమ్మెల్సీ కవిత రేపు (గురువారం, మార్చి 16, 2023) ఈడీ విచారణకు హాజరు కానున్నారు.

అయితే ఇప్పటికే ఒకసారి (మార్చి 11న) ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడి దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించగా.. ఆమె తన వాంగ్మూలాన్ని ఈడికి సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత గత వారంలోనే ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనపై జరుగుతున్న ఈడి విచారణ నుంచి దృష్టి మళ్లించడానికే కవిత నిరాహారదీక్ష చేపట్టారని బిజెపి, కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =