తెలంగాణ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం

Mango News Telugu, Nine Day Budget Sessions Of Telangana, Nine Day Budget Sessions Of Telangana Assembly, Nine Day Budget Sessions Of Telangana Assembly Begins, Nine Day Budget Sessions Of Telangana Assembly Begins Today, Political Updates 2019, Telangana Assembly 2019, Telangana Assembly Budget, Telangana Assembly Budget Session, Telangana Assembly Budget Session 2019, Telangana Breaking News

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యాయి. ఆరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ 2019-20 సంవత్సరానికి గాను రూ.1,46,492.3 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు శాసనమండలిలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభను సెప్టెంబర్ 14వ తేదికు వాయిదా వేశారు. ఈ రోజు నుంచి శాసనసభ, మండలి సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 22వ తేదీవరకు కొనసాగుతాయి. తొలుత దివంగత సభ్యులకు సంతాప తీర్మానాలపై చర్చించారు.

సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో గురుకుల పాఠశాలలకు సంబంధించి మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానమిచ్చారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికీ గురుకులాల్లో అవకాశం కల్పిస్తున్నామని, ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యను అందిస్తున్నామని చెప్పారు. మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్) గురించి, నగరంలో డ్రైనేజీ వ్యవస్థ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖకు సంబంధించిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. తరువాత రాష్ట్ర సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై పూర్తీ స్థాయి చర్చ జరగనుంది.

 

[subscribe]
[youtube_video videoid=GN_y_ty7nco]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − eleven =