ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహణ : సీఎస్

BRKR Bhavan, Mango News, Retirement Function of Secretariat Employees, Retirement Function of Secretariat Employees held at BRKR Bhavan, Secretariat, Secretariat Employees, Secretariat Employees Retirement, Secretariat Employees Retirement Ceremony, Secretariat Employees Retirement Function, Secretariat Employees Retirement News, Somesh Kumar, Telangana CS

సచివాలయంలో వివిధశాఖలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఏడుగురు ఉద్యోగులకు బిఆర్కెఆర్ భవన్ లో సన్మాన సభ నిర్వహించారు. ఈ సన్మాన సభకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలని పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో వివిధ శాఖలలో పనిచేసి పదవీ విరమణ పొందుతున్న 7 గురు ఉద్యోగులకు బిఆర్ కెఆర్ భవన్ 10 వ అంతస్ధులో సన్మాన సభ జరిగింది. ఈ సభలో ఆయాశాఖలకు సంబంధించిన కార్యదర్శులు పాల్గొన్నారు.

ఈ రోజు పదవీ విరమణ పొందిన ఉద్యోగులను ప్రభుత్వ వాహనంలో వారి గృహాలవద్ద డ్రాప్ చేయాలని సీఎస్ ఆదేశించారు. భవిష్యత్తులో నిర్వహించే పదవీ విరమణ సన్మాన సభకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ ను తయారు చేసి పాటించాలని ఆదేశించారు. పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల సేవలను సీఎస్ కొనియాడారు. జీఏ (టీవీసీ)శాఖ అడిషనల్ సెక్రటరీ జి.క్రిష్ణవేణి, ఐటీఈ అండ్‌సీ శాఖ డిప్యూటీ సెక్రటరీ టి.పద్మసుందరి, మైనారిటీ వెల్ఫేర్ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ మహమ్మద్ నసీర్, పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్ మెంట్ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ బి.మంజుల, టిఆర్ అండ్ బి శాఖ సెక్షన్ ఆఫీసర్ అర్జున్ సింగ్, ఫైనాన్స్ శాఖ సెక్షన్ అసిస్టెంట్ గ్రేడ్-2 పాల్ ఫ్రాన్సిస్ మరియు జీఏ (ఓపీ-2) శాఖ ఆఫీస్ సబార్డినేట్ ఎన్ గంగమ్మ శనివారం నాడు పదవీ విరమణ పొందారు.

ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఐటి ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, మైనార్టీ కార్యదర్శి అహ్మద్ నదీం, ప్రొటోకాల్ జాయింట్ సెక్రటరీ అర్విందర్ సింగ్, అడిషనల్ సెక్రటరీ నరేందర్ రావు మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =