కేసీఆర్‌ మరో షాక్.. బరిలోకి 100 మంది పౌల్ట్రీ రైతులు

KCR is another shock 100 poultry farmers in the ring,KCR is another shock,100 poultry farmers in the ring,poultry farmers,Mango News,Mango News Telugu,telangana assembly elections, cm kcr, brs, kamareddy, poultry farmers,poultry farmers Latest News,poultry farmers Latest Updates,Telangana assembly elections Latest News,Telangana assembly elections Latest Updates,KCR Latest News,KCR Latest Updates,Telangana Political News And Updates
telangana assembly elections, cm kcr, brs, kamareddy, poultry farmers

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ పరుగులు తీస్తున్నాయి. అన్ని పార్టీలకంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. తాను గజ్వేల్, కమారెడ్డి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. అయితే ఈసారి ఎలాగైనా కేసీఆర్‌ను ఓడించాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ రంగంలోకి దిగుతున్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకు అస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు.

గత ఎన్నికల్లో కల్వకుంట్ల కవితకు పోటీగా నిజామాబాద్ పసుపు రైతులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 1000 నామినేషన్లు కవితకు పోటీగా దాఖలు చేశారు. ఆ సమయంలో కవిత ఓడిపోయారు. అయితే అప్పుడు కవితకు వచ్చిన చిక్కే.. ఇప్పుడు కేసీఆర్‌కు కూడా వచ్చింది. మొన్నటి వరకు కమారెడ్డి రైతులు కేసీఆర్‌కు పోటీగా నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. 100 మంది రైతులు నామినేషన్లు వేసేందుకు రెడీ అయిపోయారు. చివరికి మాస్టర్ మైండ్ కేటీఆర్ రంగంలోకి దిగడంతో.. రైతులు సద్ధుమనిగారు.

అటు రైతులు కూల్ అవ్వగానే.. ఇటు పౌల్ట్రీ రైతులు కేసీఆర్‌పై పోటీకి సై అంటున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా తాము కూడా 100 నామినేషన్లు వేస్తామని హెచ్చరిస్తున్నారు. కార్పోరేట్ శక్తుల నుంచి తమకు అన్యాయం జరుగుతోందని.. తమ డిమాండ్ల సాధన కోసమే నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నామని పౌల్ట్రీ రైతులు చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కి తగ్గేదే లేదని.. నామినేషన్లు వేసి తీరుతామని అంటున్నారు. దీంతో కేసీఆర్‌కు ఓ చిక్కు పోగానే.. మరో చిక్కొచ్చి పడినట్లు అయింది.

ఇప్పటికే కేసీఆర్ పోటీగా రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ దిగుతున్నారు. దీంతో పోటీలో నెగ్గడం కేసీఆర్‌కు కాస్త కష్టతరంగా మారింది. అటువంటిది ఇప్పుడు పౌల్ట్రీ రైతులు కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోటీకి దిగితే.. కేసీఆర్‌కు మరింత కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. అటు రైతులు పోటీకి దిగుతామని ప్రకటించగానే.. వెంటనే కేటీఆర్ రంగంలోకి దిగారు. రైతులందరితో మాట్లాడి వారిని శాంతింపజేశారు. మరి ఈసారి కూడా కేటీఆర్ రంగంలోకి దిగుతారా?.. పౌల్ట్రీ రైతులను శాంతింపజేస్తారా?.. రైతులు నమ్మినట్లుగానే.. పౌల్ట్రీ రైతులు కూడా కేటీఆర్ మాటలను నమ్ముతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =