సమతా కుంభ్-2024 బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ ఇదే..

Samatha kumbh 2024,muchintal, Sriramanagaram, chinna jeeyar swamy,Samatha Kumbh, Statue Of Equality, Jetworld , A Celebration Of Equality,Chinna Jeeyar Swamiji,chinna jeeyar swamy videos,Ramanujacharya,Chinna Jeeyar Swami Videos,Chinna Jeeyar Swami Speech,Mango News Telugu,Mango News
samatha kumbh 2024. muchintal, Sriramanagaram, chinna jeeyar swamy

సమతా కుంభ్-2024 బ్రహ్మోత్సవాలకు ఆధ్యాత్మిక నగరం శ్రీరామనగరం సిద్ధమయింది. హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ మహత్కార్యం జరగనుంది. ఈనెల 20 నుంచి మార్చి 1 వరకు అట్టహాసంగా సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం సమతామూర్తి స్పూర్తి కేంద్రం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా రోజువారీ షెడ్యూల్..

5: 45 గంటలకు సుప్రభాతం

6:00 – 6:30 గంటల వరకు అష్టాత్యక్షరి మంత్రం జపం

6:30 – 7:30 గంటల వరకు ఆరాధన

7:30 – 9:00 గంటల వరకు శాత్తుమురై, తీర్థ, ప్రసాద గోష్టి

9:00 – 10:00 గంటల వరకు నిత్యపూర్ణాహుతి, బలి హరణం

10:30 – 11:30 గంటల వరకు అభిషేక సేవ, 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవ సరంభం

11:30 – 1:00 గంటల వరకు స్పెషల్ ఉత్సవం సెలబ్రేషన్స్

1:30-4:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు

5:00 – 5:45 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం జపం

6:00 – 7:30 గంటల వరకు సాకేత రామచంద్ర స్వామి గరుడ వాహనసేవ

7:30 – 8:00 గంటల వరకు నిత్యపూర్ణాహుతి

8:00 – 9:00 గంటల వరకు మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్టి

ఇక 20 తేదీన అంటే మంగళవారం రోజున స్వర్ణమూర్తి భగవత్ రామానుజాచారి స్వామి వారికి ఉదయం 7:30 గంటల నుంచి 10: 30 గంటల వరకు అర్థాభిషేకం నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు భీష్మ ఏకాదశి.. శ్రీ విష్ణు సహస్రనామ పారాయనం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు విశ్వకసేన పూజా అంకురార్పణం జరగనుంది.

21 తేదీ బుధవారం రోజున శ్రీ సీతాసమేత రామచంద్రస్వామివారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగింపుగా దివ్యసాకేతం నుంచి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వద్దకు వేదపండితులు తీసుకొస్తారు.  8:30 గంటలకు వేద పండితులు హోమం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 8:30 గంటల వరకు 18 దివ్యదేశాల ఉత్సవ మూర్తులను 18 విశిష్టమైన గరుడ వాహనములపై ఊరేగింపుగా యాగశాలకు తీసుకురానున్నారు. ఆ మరునాడు అంటే గురువారం 18 దివ్యదేశాల ఉత్సవ మూర్తులకు ఉదయం అభిషేకం నిర్వహించనున్నారు.

23వ తేదీ శుక్రవారం రోజున సాహూహిక లక్ష్మీనారాయణ పూజను వేదపండితులు నిర్వహించనున్నారు. శనివారం రోజున 18 దివ్యదేశ ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించనున్నారు. అదే రోజున గ్లోబల్ రామాయణం క్విజ్ కాంపిటీషన్‌ కూడా నిర్వహిస్తున్నారు. 25వ తేదీ ఆదివారం రోజున వేద పండితులు శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 26వ తేదీని వసంత ఉత్సవం.. 27వ తేదీని డోలోత్సవం.. 28న దివ్యదేవతలకు తిరుమంజన, అభిషేకం నిర్వహించనున్నారు. అదే రోజున సాయంత్రం 4 గంటలకు వేదపండితులు తెప్పోత్సవం నిర్వహిస్తారు.

29వ తేదీ అంటే గురువారం రోజున రతోత్సవ యాత్ర, చక్ర స్నానం నిర్వహిస్తారు. ఇక చివరి రోజు అంటే మార్చి 1వ తేదీని శ్రీ పుష్ప యజ్ఞం, దేవత ఉద్వాసన, ద్వాదస ఆరాధన, మహాపూర్ణాహుతిని వేద పండితులు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీరామనగరంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వాహకులు నిర్వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =