దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రాజకీయ ప్రస్థానం

A lawyer and a politician,Raghunandan Rao, Telangana Election 2023, Dubbaka BJP candidate Raghunandan Rao, political leader, lawyer, politician,Mango News,Mango News Telugu,lawyer and politician,Dubbaka BJP candidate Latest News,Dubbaka BJP candidate Latest Updates,BJP candidate Raghunandan Rao News Today,BJP candidate Raghunandan Rao Live Updates,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates,Raghunandan Rao Live News
Raghunandan Rao, Telangana Election 2023, Dubbaka BJP candidate Raghunandan Rao, political leader. lawyer, politician.

మొదటగా న్యాయవాది అవ్వాలనే కోరికతో ఎల్ఎల్‌బీ చదివిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. కొన్నాళ్లు న్యూస్ కంట్రిబ్యూటర్‌గానూ కొనసాగారన్న  విషయం చాలామందికి తెలియదు.  తర్వాత  ఎన్నో ఓటమిలు ఎదురయినా..  తన రాజకీయ ప్రస్థానంలో ఒక్కో మెట్టు ఎదిగారు.  పార్టీ క్యాడర్‌కు ఎప్పుడైనా అందుబాటులో ఉంటారనే మంచి పేరు కూడా ఉంది. 2020లో జరిగిన దుబ్బాక బై ఎలక్షన్స్‌లో బీజేపీ తరపున బరిలోకి దిగి అధికార పార్టీ అభ్యర్ధిపై.. స్వల్ప మెజార్టీతో గెలుపొందారు.

రఘునందన్ రావు .. మార్చి 23,1968లో సిద్ధిపేటలో జన్మించారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్, ఎల్ఎల్‌బీ,బీఈడీ హ్యూమన్ రైట్స్ తో పీజీ డిప్లమా పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్​ఎల్​బీ పట్టా పొందిన రఘునందన్ రావు..డిగ్రీ పట్టా పొందిన తర్వాత 1991లో పటాన్ చెరుకు వచ్చేసారు. మొదట్లో ఓ ప్రముఖ తెలుగు న్యూస్ పేపర్‌కు ఐదేళ్ల పాటు న్యూస్ కంట్రీబ్యూటర్‌గా కూడా రఘునందన్ రావు పని చేశారు.

కానీ కొన్ని కారణాలతో  పేపర్ మీడియాను వదిలిపెట్టిన రఘునందన్ రావు..ఆ తర్వాత ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో లాయర్‌గా కొనసాగారు. అయితే 2013 సమయంలో అసదుద్దీన్ ఓవైసీ పిటిషన్ కేసు తీసుకోవడంతో రఘునందన్  పేరు.. పెద్ద సెన్సేషన్ అయింది. ఉద్యోగం వేరు.. రాజకీయం వేరని అప్పట్లోనే ఆ కేసు తీసుకున్నప్పుడు  రఘునందన్ రావు వాదించి  ఒప్పించడంతో ఆయనకు  లాయర్ విద్యలో మంచి పేరు  వచ్చింది.

అయితే చిన్నప్పటి నుంచి రఘునందన్ రావుకు రాజకీయాలపైన ఉన్న  ఆసక్తితో.. ఆయన 2001లో  టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)లో చేరారు. పొలిట్‌బ్యూరో సభ్యులుగా, మెదక్ జిల్లా అధ్యక్షులుగా రఘునందన్ పనిచేశారు. అయితే 2013లో టీఆర్ఎస్ అధిష్టానం కొన్ని కారణాలతో రఘునందన్ రావును సస్పెండ్ చేయగా.. బీజేపీ గూటికి చేరారు.ఆ తర్వాత 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

కానీ ఆ తర్వాత 2020 దుబ్బాక బై ఎలక్షన్స్‌లో పోటీ చేసి.. అప్పటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి అయిన సోలిపేట సుజాతపై 1,074 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఒక రకంగా ఈ విజయమే తెలంగాణలో బీజేపీకి పెద్ద ప్లస్‌గా మారింది. 2018 ఎన్నికల లెక్కల ప్రకారం  రఘునందన్ రావు ఆస్తుల విలువ రూ. 15.93 కోట్లుగా ఉంటే  అప్పుల విలువ రూ. 80 లక్షలుగా ప్రకటించారు.  ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో రఘునందన్  రావు పోటీ పడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =