కేంద్రాన్ని ఫాలో అవుతున్న తెలంగాణ

What Will The Budget Look Like This Year,Telangana,Deputy CM Mallu Bhatti Vikramarka,CM Revanth Reddy,Budget Proposals,Telangana Deputy CM,Telangana News,Telangana Latest News,Telangana Budget Proposals,Revanth Reddy,CM Revanth Reddy,CM Revanth Reddy Latest News,Telangana Budget Proposals,Telangana Budget 2024,Congress,Congress Latest News,Mango News,Mango News Telugu

సెంట్రల్ గవర్నమెంట్ తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టాలనుకుంటుంది.దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా  స్పష్టమైన ప్రకటన రాకపోయినప్పటికీ ఆర్థిక శాఖ వర్గాలు మాత్రం ఓటాన్ అకౌంట్‌గానే ఉంటుందనే సంకేతమిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల వల్ల కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ పెడుతుండటంతో..తెలంగాణ  ప్రభుత్వం కూడా అదే బాట ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెడితే.. తెలంగాణకు వచ్చే గ్రాంట్లు, వివిధ వెల్పేర్ స్కీమ్‌ల కోసం ఏ మేరకు కేటాయింపులు ఉంటాయనే విషయాలపై స్పష్టత ఏర్పడుతుంది. కానీ ఓటాన్ అకౌంట్ పెడుతుండటంతో..తెలంగాణకు  రాబోయే ఆర్థిక సంవత్సరం ఏ మేరకు నిధులు అందుతాయనే విషయం తెలంగాణ  రాష్ట్ర అధికారులకు తెలిసే అవకాశం లేదు.దీన్ని దృష్టిలో పెట్టుకునే రేవంత్ సర్కార్ కూడా ఓటాన్ అకౌట్‌ బడ్జెట్‌ను పెట్టడమే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

కొద్ది రోజులుగా వివిధ శాఖల కేటాయింపు ప్రతిపాదనలపై.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో వివిధ శాఖల మంత్రులు, అధికారులు సమీక్ష చేస్తున్నారు. అంతేకాకుండా అతి త్వరలోనే  సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్న శాఖల బడ్జెట్ ప్రపోజల్స్‌పై మరో రివ్యూ జరగనుంది.అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కే ప్రభుత్వం మొగ్గు చూపిస్తూ ఉండటంతో.. గతేడాదితో పోలిస్తే బడ్జెట్ సైజు తక్కువగానే ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  గతేడాది నాన్ టాక్స్ రెవిన్యూను కాస్త ఎక్కువగా చూపించినా ఈసారి  మాత్రం ఓటాన్ అకౌంట్ కావడంతో రెవెన్యూని కాస్త తగ్గించే అవకాశాలున్నాయి.

దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి నుంచి మంత్రుల వరకు..ప్రజల ముందదు వాస్తవిక బడ్జెట్‌నే ప్రవేశపెట్టాలని నొక్కిచెప్తున్నారు. దీంతో ఆచరణకు సాధ్యమయ్యే ఆదాయ వనరులనే అధికారులు అందులో ప్రస్తావించనున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డితో పాటు  మొత్తం మంత్రివర్గం అనడంతో.. దానికి తగినట్లుగా  ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఉండనున్నాయి.

ప్రస్తుతానికి ఓటాన్ అకౌంట్‌లో అంచనాలుగా బడ్జెట్ వివరాలను పెడుతున్నా జూలై లేదా ఆగస్టు మాసాల్లో పెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఆయా స్కీముల మార్గదర్శకాలు, అర్హులైనవారి సంఖ్యకు అనుగుణంగా సవరించిన అంచనాలతో సమగ్రమైన కేటాయింపులు చేయబోతోంది. దీనిపై ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాత.. ఏయే శాఖకు ఏ మేరకు కేటాయింపులు చేయాలనే విషయంలో ఆర్థిక శాఖ అధికారులు అంచనాకు రానున్నారు.

ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన కొన్ని హామీలను కూడా అమలు చేయాల్సి ఉండటంతో.. రాబోయే ఆర్థిక సంవత్సరంలో సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేసి కాపిటల్ ఎక్స్ ‌పెండిచర్‌కు తక్కువ కేటాయింపులు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం తీసుకోడానికి అదనంగా తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డిపార్టుమెంటు నుంచి కూడా కొంత కేటాయింపులు ఉండనున్నాయి. అయితే బీఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చు, తీసుకున్న అప్పులు కూడా పరిగణనలోకి తీసుకుని.. వాటిపై చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా ఈసారి బడ్జెట్‌లో రిఫ్లెక్టు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 8 =