తెలంగాణ రాష్ట్రానికి మరో పెట్టుబడి, రూ.250 కోట్లతో ఎస్3వీ సంస్థ యూనిట్ ఏర్పాటు

S3V Vascular Technologies to Invest Rs 250 Cr in Telangana to Setup Manufacturing Facility, S3V Vascular Technologies to Invest Rs 250 Cr in Telangana, S3V Vascular Technologies to Invest Rs 250 Cr to Setup Manufacturing Facility, S3V Vascular Technologies, S3V Vascular Technologies to Invest in Telangana, Manufacturing Facility, S3V, Vascular Technologies, manufacture Of high-end critical lifesaving neuro and cardiac medical devices, neuro and cardiac medical devices, neuro medical devices, cardiac medical devices, Hyderabad, Telangana, Telangana Latest News, Telangana Latest Updates, Telangana Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు మరో పెట్టుబడి వచ్చి చేరింది. ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్ సంస్థ సంగారెడ్డిలోని తెలంగాణ మెడికల్ డివైజెస్ పార్క్‌లో రూ.250 కోట్ల పెట్టుబడితో తమ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్ లో హై ఎండ్ న్యూరో అండ్ కార్డియాక్ వైద్య పరికరాలను తయారు చేయనున్నారు. గురువారం నాడు ఎస్3వీ సంస్థ ప్రమోటర్, డైరెక్టర్ బదరి నారాయణ్ మరియు డైరెక్టర్ డా.విజయ గోపాల్ నేతృత్వంలోని ప్రతినిధులు బృందం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యూనిట్ ఏర్పాటుపై ప్రకటన చేశారు.

ఈ యూనిట్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 250 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. న్యూరో మెడికల్ డివైజెస్, నెక్ట్స్‌ జనరేషన్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్, డ్రగ్ కోటెడ్ క్రిటికల్ కేర్ క్యాథరర్స్ లను ఈ యూనిట్‌లో తయారు చేయనున్నట్టు ఎస్3వీ సంస్థ తెలియజేసింది. ఈ పెట్టుబడిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, “వైద్య పరికరాలలో దాదాపు 78% దిగుమతి చేసుకున్నవే. అయితే మరింత స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సుల్తాన్‌పూర్‌ లో 250 ఎకరాల్లో వైద్య పరికరాల పార్కును ప్రారంభించింది. 750 ఉద్యోగులతో రూ.250 కోట్లతో తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్ సంస్థను స్వాగతిస్తున్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =