తెలంగాణ వైద్య శాఖ‌లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవ‌లు పొడిగింపు

Telangana Govt Extends Health Dept Contract and Outsourcing Employees Period for Another Year,Mango News,Mango News Telugu,Telangana,Telangana News,Telangana Govt,Telangana Govt Extends Health Dept Contract,Health Dept Contract,Outsourcing Employees Period,Outsourcing Employees,Employees,Employees Period,Outsourcing Employees Period,Telangana Outsourcing Employees,Period Increased,Outsourcing Employees In Health Department,Health Department,Telangana Health Department,Telangana Outsourcing Employees News,Telangana Outsourcing Employees Period for Another Year,Telangana Outsourcing Employees Period Increased

తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్ర‌స్తుతం వైద్య‌, ఆరోగ్య శాఖ‌లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప‌ద్ధతిలో ప‌నిచేస్తోన్న ఉద్యోగుల కాల‌ప‌రిమితిని మరో ఏడాది పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. 7,180 మంది తాత్కాలిక ఉద్యోగులను, అలాగే కోవిడ్‌-19 సేవ‌ల కోసం 1,191 మంది ఉద్యోగుల సేవ‌ల‌ను మరో ఏడాది పాటు కొన‌సాగించ‌నున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్ర‌భుత్వం శనివారం నాడు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైద్య శాఖలో సేవలు సమర్ధవంతంగా జరిగేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేలమంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్ధంగా వున్న అర్హులైన వైద్యులనుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని చెప్పారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే వీరికి గౌరవప్రదమైన రీతిలో జీతాలు అందించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =