తెలంగాణలో జిల్లాల అదనపు కలెక్టర్లకు కొత్త కియా కార్లు

32 Kia Carnival MPVs gifted by Telangana government, 33 additional collectors get high-end SUV’s from KCR, Kia Carnival Cars for District Additional Collectors, Mango News, Telangana CM gifts 32 new KIA cars to Addl DMs, Telangana gifts 32 Kia Carnival cars to Additional Collectors, Telangana gives 32 Kia Carnival cars to additional collectors, Telangana Govt, Telangana govt buys 32 Kia Carnivals for officials, Telangana Govt Provides Kia Carnival Cars for District Additional Collectors, Telangana govt’s purchase of 32 luxury vehicles for IAS

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాల అడిషనల్ కలెక్టర్లు కోసం కేటాయించిన కియా కార్నివాల్ కార్లను ఆదివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరిశీలించారు. అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ కియా కార్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.

మరోవైపు ఆదివారం నాడు జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీ రాజ్ అధికారుల (డిపీవో) తో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిపై సీఎం కేసీఆర్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, అదనపు కలెక్టర్లకు తగురీతిలో గౌరవం ఇస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పాటయిన అనతికాలంలోనే దేశం గర్వించదగ్గ స్థాయిలో అనేక రకాలుగా గ్రామీణ పట్టణాభివృద్ధి పథకాలను కార్యక్రమాలను అమలు పరుస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని సీఎం తెలిపారు. అయితే యేదో సాధించినామని తృప్తి పడి, అక్కడితే ఆగిపోవడం సరికాదని సీఎం పేర్కొన్నారు. కలెక్టరు అనే పదాన్ని పదే పదే చట్టంలో రూపొందించింది, అదనపు కలెక్టర్లును దృష్టిలో ఉంచుకొనే అని సీఎం తెలిపారు. జిల్లా కలెక్టరు కార్యాలయాల్లో, కలెక్టరు ఆఫీసు రూం పక్కన్నే అదనపు కలెక్టర్ల రూం ను ఏర్పాటు చేసి వారికి ప్రోటోకాల్ గౌరవాన్ని మరింత పెంచుతామన్నారు. ‘‘పని ఎత్తుకుంటే ఏదో చేసినమంటె చేసినం అన్నట్టుగా డ్రై గా చేయకూడదు. మనసు పెట్టి రసాత్మక హృదయంతో పనిలో లీనమై చేయాలని” సీఎం సూచించారు. అప్పుడే సరియైన ఫలితాలను రాబట్టగలమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =