బహుజన స్ఫూర్తి ప్రధాతలపై జాతీయ సదస్సు – తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్

Telangana Sahitya Akademi Chairman Gouri Shankar Released Poster of Conference on Bahujan Inspirational Heads, Telangana Sahitya Akademi, Chairman Gouri Shankar, Conference on Bahujan Inspirational Heads, Mango News, Mango News Telugu, Bahujan Inspirational Heads, Telangana Sahitya Akademi Chairman, Sahitya Akademi Chairman, Juluru Gauri Shankar, Bahujana Sahitya Academy, Gouri Shankar, Telangana Sahitya Academy Chairman, Telangana Sahitya Academy Chairman 2022, Telangana Sahitya Akademi Latest News And Updates

బహుజనులకు అండగా నిలిచి సామాజిక ఉద్యమాలు నిర్మిస్తూ, సాహిత్య సాంస్కృతిక చరిత్రలను సృష్టించిన సాహిత్య సాంస్కృతిక సామాజిక యోధుల చరిత్రలను నమోదు చేసుకోవడం శుభపరిణామమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత రాష్ట్రంలో సాహిత్య సాంస్కృతిక చరిత్రలను రాబోయే తరాలకు అందించే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నవంబర్ 17, 18 తేదీలలో జరగనున్న “బహుజన స్ఫూర్తి ప్రదాతలు” అన్న రెండు రోజుల జాతీయ సదస్సు పోస్టర్‌ను మంగళవారం అకాడమీలో జూలూరు గౌరీశంకర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన అనేకమంది సామాజిక ఉద్యమకారులు కలం యోధులుగా మారి అద్భుతమైన సాహిత్య సృష్టి చేశారన్నారు. భాగ్యరెడ్డి వర్మ, మగ్గూం మోహియుద్దీన్, కొండా లక్ష్మణ్ బాపూజీ, సామల సదాశివ, కొత్త పల్లి జయంశంకర్, బిరుదరాజు రామరాజు, కాపు రాజయ్య, కపిలవాయి లింగమూర్తి, చందాల కేశవదాసు, చిందు ఎల్లమ్మ లాంటి అనేకమంది తమ కలాల గళాల ద్వారా బహుజన స్పూర్తిని రగిలించిన యోధులని అభివర్ణించారు. బహుజన కలాలు గళాలు లేకుండా తెలుగు సాహిత్యమే లేదన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ.శ్రీనివాస రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డా.ఎస్.రమేష్ బాబు, తెలుగు శాఖాధ్యక్షులు వెల్దండి శ్రీధర్, ప్రముఖ సాహిత్య విమర్శకులు కె.పి.అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =