టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు నోటీసులు జారీ చేసిన సీఐడీ

Andhra Pradesh, AP CID issue notices to TDP leader Devineni Uma, Ap Political News, AP Politics, CID files case against Devineni Uma, CID officials Issued Notices to TDP Leader Devineni Uma, CID officials serve notices to Devineni Uma, Devineni Uma, Mango News, Notices to TDP Leader Devineni Uma, TDP Leader, TDP Leader Devineni Uma, Uma dares govt. to arrest him

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు గురువారం నాడు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ముందుగా దేవినేని ఉమా ఏప్రిల్ 7న నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ మాటలను వక్రీకరించారని ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదుతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. మార్ఫింగ్‌ చేయబడిన సీఎం జగన్‌ వీడియోలు ప్రదర్శించారనే అభియోగంతో 464, 465, 468, 469, 470, 471, 505, 120(బి) సెక్షన్ల కింద దేవినేని ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ రోజు గొల్లపూడిలోని ఆయన నివాసంలో నోటీసులు అందజేసి, కర్నూలు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సూచించారు. అలాగే ఆ ప్రెస్‌మీట్‌ ప్రదర్శించిన వీడియోలను కూడా తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + sixteen =