భారత అటార్నీ జనరల్‌గా మరోసారి బాధ్యతలు చేపట్టనున్న సీనియ‌ర్ లాయ‌ర్ ముకుల్ రోహ‌త్గీ

Senior Advocate Mukul Rohatgi To Serve as Indias Attorney General For The Second Time, Mukul Rohatgi Attorney General for India, Senior Advocate Mukul Rohatgi , Attorney General for India, Indias Attorney General For The Second Time, Mukul Rohatgi , Mango News, Mango News Telugu, Mukul Rohatgi Latest News And Updates, Mukul Rohatgi To Return As Attorney General, Mukul Rohatgi Set To Be Attorney General , Mukul Rohatgi Likely To Be Attorney General, Attorney General Of India

సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మరోసారి భారతదేశానికి అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అక్టోబరు 1 నుంచి దేశ అత్యున్నత న్యాయ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ప్రస్తుత అటార్నీ జనరల్ పదవీకాలం కేకే వేణుగోపాల్ పదవీకాలం సెప్టెంబరు 30తో ముగియనుంది. ఇక 91 ఏళ్ల వేణుగోపాల్ జూన్ 30, 2017న దేశ అత్యున్నత న్యాయ అధికారిగా నియమితులయ్యారు. ఈ ఐదేళ్లలో ఆయనకు అనేకసార్లు పొడిగింపులు ఇచ్చారు. వయస్సురీత్యా ఆయన తప్పుకోనుండటంతో ముకుల్ రోహ‌త్గీ ఈ అత్యున్నత పదవిని చేపట్టేందుకు తన సమ్మతిని తెలిపారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఆయన అటార్నీ జనరల్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టనుండటం విశేషం. ఇక ఆయన 2014లో తొలిసారిగా మూడేళ్ల కాలానికి గాను అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. అలాగే గ‌తంలో అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియాగా కూడా రోహ‌త్గీ పనిచేశారు. కేంద్రప్రభుత్వానికి ఎదురయ్యే న్యాయపరమైన అంశాల్లో అటార్నీ జనరల్‌ పాత్ర కీలకం అన్న సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + two =