ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబు

Andhra Pradesh Agriculture Budget 2022-23 Updates, Agriculture Budget 2022-23 Updates, AP Budget 2022-2023 Minister Kurasala Kannababu Introduces AP Agriculture Budget, AP Budget 2022-2023, Minister Kurasala Kannababu Introduces AP Agriculture Budget, AP Agriculture Budget, Minister Kurasala Kannababu, Assembly Session 2022, AP Budget Session 2022, Budget Session, Andhra Pradesh Budget Session, AP Budget Session, 2022 AP Budget Session, AP Assembly Budget Session 2022-23, AP Assembly Budget Session 2022, AP Assembly Budget Session, AP Assembly Budget, Andhra Pradesh assembly budget session, AP Budget 2022-23, AP Budget 2022, AP Budget, Andhra Pradesh, Andhra Pradesh Assembly, AP Assembly, AP Assembly Session, Budget Session 2022, Manog News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రూ.2,56,257 కోట్ల అంచనా వ్యయంతో 2022-23 సంవత్సరానికి గానూ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం శాసనసభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు 2022-23 సంవత్సరానికి గానూ వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

వ్యవసాయ రంగంలో జాతీయ అభివృద్ధి రేటు కన్నా ఏపీ వృద్ధి రేటు అధికంగా ఉందని చెప్పారు. 2020–2021లో జాతీయ స్థాయిలో 7.5 శాతం నమోదు కాగా, ఏపీ 10.39 శాతం వృద్ధి రేటును సాధించిందన్నారు. 2021–2022లో జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 9.8 శాతంగా నమోదు కాగా, ఏపీలో వృద్ధిరేటు 14.5 శాతం నమోదైందని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 33 నెలల కాలంలో వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాల కోసం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని, అందులో రైతు భరోసా, పీఎం కిసాన్‌ నిధి కోసం రూ.20,117.08 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. వ్యవసాయ రంగం కోసం ఈ వార్షిక బడ్జెట్‌లో రూ.11,387.69 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

బడ్జెట్ కేటాయింపులు:

  • రైతు భరోసా కేంద్రాల నిర్మాణం – రూ.18 కోట్లు
  • వైఎస్ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం – రూ.7,020 కోట్లు
  • మార్కెట్‌ యార్డుల్లో నాడు–నేడు, మార్కెటింగ్‌ శాఖ అభివృద్ధి – రూ.614.23 కోట్లు
  • వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ – రూ.5000 కోట్లు
  • సహకార సంఘాల కోసం – రూ.248.45 కోట్లు
  • ఫుడ్ ప్రాసెస్సింగ్ కోసం – రూ.146.41 కోట్లు
  • ఉద్యానశాఖ – రూ.554 కోట్లు
  • పట్టు పరిశ్రమ కోసం – రూ. 98.99 కోట్లు
  • ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ కోసం – రూ.421.15 కోట్లు
  • వైఎస్ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం కోసం – రూ.59.91 కోట్లు
  • వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కోసం – రూ.122.50 కోట్లు
  • ప్రకృతి విపత్తుల సహాయనిధి – రూ.2000 కోట్లు
  • పశు సంవర్థక శాఖ – రూ.1,027.82 కోట్లు
  • మత్స్యశాఖ అభివృద్ధి – రూ.337.23 కోట్లు
  • వైఎస్ఆర్‌ సున్నావడ్డీ పంట రుణాల కోసం – రూ.500 కోట్లు
  • వైఎస్ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం – రూ.1,802 కోట్లు
  • వైఎస్ఆర్‌ జలకళ – రూ.50 కోట్లు
  • వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్షా కేంద్రాల కోసం – రూ.50 కోట్లు
  • వైఎస్ఆర్‌ రైతు భవన్‌ నిర్మాణాల కోసం – రూ.52 కోట్లు
  • వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత కోసం – రూ.200 కోట్లు
  • రైతుల ఎక్స్‌గ్రేషియా కోసం – రూ.20 కోట్లు
  • విత్తన రాయితీ కోసం – రూ.200 కోట్లు
  • నీటి పారుదల రంగం – రూ.11,450.94 కోట్లు

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + ten =