ఏపీలో పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షల షెడ్యూలు విడుదల, ఎప్పటినుంచంటే?

Andhra Pradesh SSC Pre Final Exams 2023 Time Table Released,Andhra Pradesh SSC,SSC Pre Final Exams,SSC 2023 Time Table,SSC Pre Final Time Table Released,Mango News,Mango News Telugu,Ap Ssc Results 2023,Andhra Pradesh Ssc,Andhra Pradesh Ssc Board,Andhra Pradesh Ssc Certificate,Andhra Pradesh Ssc Cgpa To Percentage,Andhra Pradesh Ssc Duplicate Marks Memo,Andhra Pradesh Ssc Exam 2022,Andhra Pradesh Ssc Results,Andhra Pradesh Ssc Results 2023,Bse.Ap.Gov.In 10Th Results 2023,Bseap Login,First Language In Ssc,Second Language In Ssc,Www.Bse.Ap.Gov.In 2022 Results,Www.Bse.Ap.Gov.In Results

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ వరకు నిర్వహించనున్నట్టు గత డిసెంబర్ లోనే ఏపీ ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో పదో తరగతి విద్యా­ర్థులకు నిర్వహించే ప్రీ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పదో తరగతి విద్యా­ర్థులకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫ్రీ ఫైనల్లో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-2 (కంపోజిట్ కోర్స్) ను ఉదయం 9.30 గంటల నుంచి 11.15 గంటల వరకు, మిగతా అన్ని పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు.

మరోవైపు రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్ఏ)–4 పరీక్షల షెడ్యూల్ కూడా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మార్చి 9, 10, 14 తేదీల్లో, 6నుంచి 9వ తరగతి విద్యార్థులకు మార్చి 9, 10, 14, 15 తేదీల్లో ఎఫ్ఏ–4 పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏపీలో పదో తరగతి-2023 ఫ్రీ ఫైనల్ పరీక్షల షెడ్యూల్:

  • మార్చి 9: ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-1 (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-1 (కంపోజిట్ కోర్స్)
  • మార్చి 10: సెకండ్ లాంగ్వేజ్‌ పేపర్
  • మార్చి 14: ఇంగ్లీష్ పేపర్
  • మార్చి 15: మ్యాథమేటిక్స్ పేపర్
  • మార్చి 16: సైన్స్ పేపర్
  • మార్చి 17: సోషల్ స్టడీస్ పేపర్
  • మార్చి 18: ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-2 (కంపోజిట్ కోర్స్), ఓఎస్‌ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్-1
  • మార్చి 20: ఓఎస్‌ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్-2.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =