సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అదానీ గ్రూప్ షేర్ల పతనంపై స్వయంగా నిపుణుల కమిటీ ఏర్పాటు

Adani Hindenburg Row Supreme Court Sets up 6 Member Committee to Probe Recent Share Crash,Adani Hindenburg Row,Supreme Court Committe,Supreme Court Sets up 6 Member Committe,Probe Recent Share Crash,Mango News,Mango News Telugu,Adani Company,Adani Cement Company,Adani Company Ahmedabad,Adani Company List,Adani Company Net Worth,Adani Company News,Adani Company Owner,Adani Company Products,Adani Company Share List,Adani Enterprises,Adani Group Career,Adani Group Products,Adani Group Products List,Adani Group Subsidiaries,Adani Power,Adani Share Price,Gautam Adani Company,Gautam Adani Company List,Gautam Adani Company Products,Gautam Adani Company Share Price,Hindenburg

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలి అదానీ గ్రూప్ షేర్లు స్టాక్ మార్కెట్‌లో భారీగా పతనమైన క్రమంలో దీనిపై లోతుగా అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు స్వయంగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ న్యాయమూర్తి అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విచారణ కమిటీలో మాజీ న్యాయమూర్తులు ఓపీ భట్, జేపీ దేవదత్ కూడా ఉన్నారు. అలాగే ప్రముఖ బ్యాంకింగ్ నిపుణులు నందన్ నీలేకని, కేవీ కామత్, సోమశేఖరన్ సుందరేశన్‌లను కమిటీలో మరో ముగ్గురు సభ్యులుగా కోర్టు పేర్కొంది. ఈ కమిటీ పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడానికి మరియు స్టాక్ మార్కెట్ల కోసం ఇప్పటికే ఉన్న నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి చర్యలను సూచిస్తుంది.

కాగా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మరియు న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ప్యానల్ మొత్తం పరిస్థితిని అంచనా వేస్తుంది. ఇక రెండు నెలల్లోగా నివేదికను సమర్పించే ఈ ప్యానెల్‌కు అన్ని సహయ, సహకారాలను అందించాలని కేంద్రం, ఆర్థిక చట్టబద్ధమైన మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్సన్‌ను బెంచ్ ఆదేశించింది. కాగా తన ఆర్డర్‌ను రిజర్వ్ చేస్తూ, ఫిబ్రవరి 17న అత్యున్నత న్యాయస్థానం ప్రతిపాదిత నిపుణుల ప్యానెల్‌పై కేంద్రం చేసిన సూచనను సీల్డ్ కవర్‌లో అంగీకరించడానికి నిరాకరించింది. ఇక ఈ అంశంపై న్యాయవాదులు ఎంఎల్‌ శర్మ, విశాల్‌ తివారీ, కాంగ్రెస్‌ నేత జయ ఠాకూర్‌, సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటున్న ముఖేష్‌ కుమార్‌లు ఇప్పటి వరకు నాలుగు పిల్‌లు దాఖలు చేశారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రకారం.. మోసపూరిత లావాదేవీలు మరియు షేర్-ధరల తారుమారు వంటి అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆరోపణలు చేయడంతో అదానీ గ్రూప్ స్టాక్‌లు మార్కెట్‌లో దెబ్బతింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =