నర్సీపట్నం పర్యటనలో వివిధ సమస్యలపై సీఎం జగన్ ను కలిసిన 13 మంది బాధితులు, రూ.లక్ష చొప్పున తక్షణ సాయం

AP CM YS Jagan Extends 1 Lakh Financial Assistance to 13 sick people in Narsipatnam Tour,AP CM YS Jagan,Extends 1 Lakh Financial Assistance,13 sick people in Narsipatnam Tour,Mango News,Mango News Telugu,YS Jagan Narsipatnam Tour,Jagan Narsipatnam Tour,AP CM YS Jagan Narsipatnam Tour,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించి సుమారు రూ.986 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఏలేరు-తాండవ ఎత్తిపోతల పథకంతోపాటు, నర్సీపట్నంలో ప్రభుత్వ వైద్యకళాశాలకు సీఎం శంకుస్థాపన చేశారు. కాగా ఈ పర్యటన సందర్భంగా వివిధ వర్గాల ప్రజల నుంచి సీఎం వైఎస్ జగన్ వినతులు స్వీకరించారు. నర్సీపట్నం పర్యటలో వివిధ రకాల సమస్యలపై 13 మంది బాధితులు సీఎంను కలిశారు. బాధితులు, వారి బంధువులతో సీఎం నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తక్షణమే వారి వైద్యం కోసం ఒక్కొక్కరికి రూ.1లక్ష మంజూరు చేస్తూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అనారోగ్య బాధితులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున 13 మందికి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అందజేశారు.

నాతవరం మండల కేంద్రానికి చెందిన రెండేళ్ల దేవరకొండ అమర్త్యరామ్ పుట్టినప్పటినుంచి పిఆర్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇతని నాలిక లోపలికి వెళ్ళిపోయి ఊపిరి సలపని వ్యాధితో బాధపడుతున్నందున తల్లిదండ్రులు తమిళనాడులోని నాగరకోయిల్ ఆసుపత్రిలో చూపించి చికిత్స చేయిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు రూ. 7.5 లక్షలు ఖర్చు అయినట్లు తెలిపారు. తగిన ఆర్ధిక స్థోమత లేకపోవడంతో చికిత్స చేయించడానికి ఇబ్బంది పడుతున్నామని సీఎం దృష్టికి తీసుకురాగా. మెరుగైన వైద్యం కోసం సాయం చేస్తామని హామీ ఇచ్చారు. రావికమతం మండలం జెడ్ కొత్తపట్నం గ్రామానికి చెందిన పాము ప్రసాద్ సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యం చేయించుకునే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నామని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వైద్యం కోసం తక్షణ ఆర్ధిక సాయంతో పాటు మెరుగైన వైద్యం కూడా అందించాలని సీఎం కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కసింకోట మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన మల్ల రోహిత్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నామని, ఆర్ధిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నామని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై సీఎం నేరుగా ఇంత వేగంగా స్పందించడం మర్చిపోలేమన్నారు.

కోటవురట్ల మండలం రాట్నాల పాలెం గ్రామానికి చెందిన పెదపూడి రిషాంత్ బాబి వివేక్‌ సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం సీఎంని వివేక్ తల్లిదండ్రుల కలిసి విజ్ఞప్తిచేయగా, చిన్నారి మెరుగైన వైద్యానికి హామీ ఇస్తూ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామం, రాజగోపాలపురానికి చెందిన బొండపల్లి శ్రీ వెంకట దుర్గా నిఖిత హైపర్ కొలెస్ట్రోమియా, సబ్‌ క్లినికల్‌ హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతుంది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్థోమత లేదని సీఎంకి నిఖిత తల్లి విన్నవించుకోగా, తక్షణ సహాయనికి సీఎం హామీ ఇచ్చారు. నర్సీపట్నం మండలం పెదబొడ్డేపల్లి గ్రామానికి చెందిన చుక్కా శివపార్వతీ యామిని బైలేటరల్ జీను వేరమ్‌ సమస్యతో బాధపడుతుంది. ఆర్ధికంగా స్థోమత లేకపోవడంతో, చికిత్స చేయించుకోవడం తమకు సాధ్యం కాదని యామిని తండ్రి సీఎంకు విన్నవించుకోగా, మెరుగైన చికిత్సకు సీఎం హామీ ఇచ్చారు. అనకాపల్లి మండలం వూడురు (అల్లిఖానూడు పాలెం) గ్రామానికి చెందిన చింతల ఆకాంక్ష గ్లోబల్‌ డెవలప్‌మెంట్ డిలేతో ఇబ్బంది పడుతుంది. ఆమెకు వైద్య సాయం తక్షణమే అందించాలని సీఎం ఆదేశించారు.

రావికమతం మండలం కొత్త కోట గ్రామానికి చెందిన గట్రెడ్డి నీరజ్‌ తల్లి తన కుమారుడు బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం సీఎంని కలిసి విన్నవించుకున్నారు. తగినంత ఆర్ధిక స్ధోమత లేకపోవడంతో చికిత్స చేయించుకోలేకపోతున్నామని తెలిపారు. వెంటనే తక్షణ సాయం కింద రూ.1 లక్ష ఇవ్వాలని సీఎం ఆదేశించారు. మెరుగైన వైద్యం అందించాలన్నారు. నాతవరం మండలం, గుమ్మడిగరడ గ్రామానికి చెందిన నరం రాజబాబు అంధత్వంతో బాధపడుతున్నాడు. సీఎం రాజబాబుకు ఆర్ధిక సాయం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నర్సీపట్నం మండల కేంద్రంలోని గొర్లివీధికి చెందిన అందలూరి యేసుబాబు బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. చిన్నారి చికిత్స కోసం అవసరమైన సాయం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. నర్సీపట్నం మండలం పినరిపాలెం గ్రామానికి చెందిన నిడదవోలు సుబ్బలక్ష్మి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఆమెకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు తక్షణ సాయం కింద రూ.1 లక్ష ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. గొలుగొండ మండలం, కొత్త ఎల్లవరం గ్రామానికి చెందిన పెట్ల పరిమళ చేతులు, కాళ్ల వంకర సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఆమెకు మెరుగైనవైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. అలాగే నర్సీపట్నం మండలం వేమలపూడి గ్రామానికి చెందిన గుడివాడ జస్మిత తలసేమియా వ్యాధితో బాధపడుతుంది. తగినంత ఆర్ధిక స్థోమత లేదని సీఎంకు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం వైఎస్ జగన్ కలెక్టర్‌ ను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =