ఏపీలో కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్, మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు

AP CM YS Jagan Launches 13 New Districts of the State Now AP Have Total of 26 Districts, AP Have Total of 26 Districts, AP CM YS Jagan Launches 13 New Districts of the State, AP Cabinet Approves Formation of 26 New Districts, 26 New Districts Declaration on April 4th, AP Cabinet, 26 New Districts, New District Formation, reorganisation of New districts, new districts Declaration on April 4th, New districts in AP Declaration on April 4th, New Districts in Andhra Pradesh, 13 new districts In AP, New District Formation In AP, Andhra Pradesh, Andhra Pradesh To Have Total of 26 Districts, New Districts in Andhra Pradesh, 13 new districts In AP, New District Formation In AP, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, AP CM, YS Jagan, CM Jagan, CM YS Jagan, 13 new districts, new districts In AP, AP new districts, AP, Mango News, Mango News Telugu,

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం వర్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలను ప్రారంభించారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం, పరిపాలనా సౌలభ్యం, అన్ని ప్రాంతాల సమతులాభివృద్ది దృష్ట్యా ప్రస్తుతమున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ కొత్త జిల్లాలను ఒక్కొక్కటిగా ప్రారంభించారు. ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన ఈ జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లాల కేంద్రాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అలాగే నేటి నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 13 జిల్లాలను 26 గా మార్చగా, ఇక రాష్ట్రంలో 23 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 72 కు చేరుకుంది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 42 సంవత్సరాల అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. గతంలో ఉన్న 13 జిల్లాల పేర్లను అలాగే ఉంచగా, కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు జరిగింది. ఈ 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను ఇప్పటికే నియమించగా, వారు వరుసగా బాధ్యతల స్వీకరిస్తున్నారు.

ఏపీలో మొత్తం 26 జిల్లాలు ఇవే:

  1. శ్రీకాకుళం
  2. పార్వతీపురం మన్యం
  3. విజయనగరం
  4. అల్లూరి సీతారామరాజు
  5. విశాఖపట్నం
  6. అనకాపల్లి
  7. తూర్పుగోదావరి
  8. కాకినాడ
  9. కోనసీమ
  10. పశ్చిమగోదావరి
  11. ఏలూరు
  12. కృష్ణా
  13. ఎన్టీఆర్
  14. గుంటూరు
  15. పల్నాడు
  16. ప్రకాశం
  17. బాపట్ల
  18. నెల్లూరు
  19. కర్నూలు
  20. నంద్యాల
  21. వైఎస్ఆర్ కడప
  22. అన్నమయ్య
  23. చిత్తూరు
  24. తిరుపతి
  25. అనంతపురం
  26. శ్రీ సత్య సాయి
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 16 =