కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం 3,148 ఎకరాల భూమి అప్పగింత

AP Govt Allocated 3148 Acres Land To Steel Plant,Steel Plant Construction In Kadapa District,Mango News,Latest Breaking News 2019,Andhra Pradesh News Today,Kadapa steel plant,YSR Kadapa Steel Plant Construction,Kadapa Steel Plant Project Details,AP CM YS Jagan
కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి – పెద్దనందులూరు గ్రామాల పరిధిలో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరుతో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌కు 3,148.68 ఎకరాల భూమిని ముందస్తుగా అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కడప జిల్లా కలెక్టర్‌కు అనుమతిస్తూ డిసెంబర్ 13, శుక్రవారం నాడు రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి తక్షణమే భూమిని అప్పగించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twelve =